Parenting : పిల్లలకు చిన్నప్పుడే ఇవి నేర్పిస్తే…గొప్ప వ్యక్తులుగా మారడం ఖాయం..!!

పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వారికి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులు పరితపిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 7, 2022 / 09:00 AM IST

పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వారికి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులు పరితపిస్తుంటారు. చిన్నతనంలో తల్లిదండ్రులు నేర్పించే అలవాట్లే…వాళ్లు పెద్దయ్యాక మంచి పేరు తెచ్చిపెడతాయని అనుకుంటారు. మనం నేర్పించే అలవాట్లే పిల్లల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. అయితే మనం నేర్పించే అలవాట్లలో కచ్చితంగా దయాగుణం అనేది ఉండాలని నిపుణులు అంటున్నారు.

దయాగుణం అనేది ఇతరుల భావాలను అర్థం చేసుకునేందుకు దోడ్పడుతుంది. సాధారణంగా పెద్దవాళ్లలో దయాగుణం ఉంటుంది. కానీ చిన్న పిల్లల్లో ఉండదు..కారణం వారికి తెలియదు. వారికి దీనికి గురించి తొందరగా అర్థం కాదు. రెండేళ్ల వయస్సున్న పిల్లలకు చాలా స్వార్థం ఉంటుంది. తమ బొమ్మల నుంచి ప్రతి విషయంలోనూ అన్నీ తమకే కావాలన్న అలవాటు ఉంటుంది. ఏదైన వస్తువును తోటిపిల్లలకు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటారు. బొమ్మలు, చాక్లెట్స్ లాంటివి ఇచ్చేందుకు ససేమిరా అంటుంటారు. అయితే అలాంటి విషయాల పట్ల పిల్లల్లో చిన్నప్పటినుంచి మార్పు తీసుకురావాలి.

ముఖ్యంగా పిల్లలకు సానుభూతి, దయాగుణం అనేవి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకుంటే ఇతరుల పట్ల సానుభూతి, దయాగుణం వంటివి నేర్పించడం వల్ల పిల్లల్లో క్లిష్టమైన ఆలోచన సమస్య పరిష్కారం ఇతరులకు సాయం చేయాలన్న ఆలోచన వారిలో పెరుగుతుంటాయి.

ఇక మన మెదడు అవసరం లేకుండా కొన్ని పనులు చేస్తుంటాం. సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తుంటే పిల్లలు వారిని అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి పేరెంట్స్ రోజువారీ జీవితంలో సానుభూతి కలిగించే సాధారణ పనులు చేస్తుంటే పిల్లలు కూడా అలా అనుసరించేందుకు ప్రయత్నిస్తారు. మనం చేసే పనుల ద్వారానే చాలా నేర్చుకుంటారు.

6నెలల వయస్సు నుంచే పిల్లలు మన చుట్టూ జరిగే విషయాలను గమనిస్తుంటారు. అప్పటి నుంచి పిల్లలు ప్రతి నిమిషం తమ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారన్న విషయాన్నే గమనిస్తుంటారట. మన ఇంటికి వచ్చిన అతిథిని ఎలా రిసివ్ చేసుకుంటున్నాం..అనే విషయం నుంచి …ఎలా మాట్లాడుతున్నాం అనేది ప్రతీది వారిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి పిల్లలకు ఏదైనా నేర్పించాలంటే మనం దానిని ఆచరిస్తే సరిపోతుంది. పిల్లల నడవడిక అనేది తల్లిదండ్రుల నుంచే మొదలౌతుంది.

దయాగుణం అనేది ఒక మంచి లక్షణం. ఇతరులపై జాలి దయా కలిగి ఉండటం వారి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా తెలుస్తాయి. ఇవన్నీ పిల్లలు వారే నేర్చుకుంటారని వదిలేకూడదు. ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నేర్పించడం చాలా ముఖ్యం. కాబట్టి పిల్లలకు దయాగుణం, కుటుంబ సంబంధాలు వంటి విషయాలను మనం స్వయంగా నేర్పించడం చాలా ముఖ్యం.