Site icon HashtagU Telugu

Vastu Tips : ఇల్లు కొంటున్నారా? వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి…లేదంటే నష్టాన్ని భరించాల్సి వస్తుంది..!!

House Warming

House Warming

కొత్త ఇల్లు కొనాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఇల్లు కొనుగోలు చేసేముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. కొంతమంది అవేం పట్టించుకోకుండా..కొనేస్తుంటారు. భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అయితే మీరు కొత్తగా ఇల్లును కొనుగోలుచేసే ముందు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.

1) ఇంటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి
మొదటి సారి ఆస్తి కొనుగోలు:
మీరు వేరొకరి ఇంటిని కొనుగోలు చేస్తుంటే, దానికంటే ముందు అతని ఆస్తికి నిజమైన యజమాని ఎవరు.. ఆ ఇల్లు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉందో తెలుసుకోవాలి. అలాగే ఆ ఇంటి గురించిన పూర్తి సమాచారం మీ వద్ద ఉంటే ఆ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే, మీరు ఇంటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకోవాలి. ఇవే కాకుండా ఇల్లును ఏ సంవత్సరంలో నిర్మించారన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.

2) సమీప మార్గాలు, దూరాన్ని తెలుసుకోండి
మీరు కొత్త స్థలంలో ఇల్లు కొంటున్నట్లయితే..ఆ ఇంటి చుట్టూ మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మీ ఇల్లు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో మీకు తెలుస్తుంది. దీనితో పాటు, మీరు మీ కుటుంబంతో నివసిస్తున్నట్లయితే, పిల్లల కోసం పాఠశాల మీ ఇంటికి ఎంత దూరంలో ఉందో కూడా మీరు తెలుసుకోవాలి.

3) ఇల్లు ఎంత ఖరీదైనది?
మీరు ఇల్లు కొనుగోలు చేసేందుకు ఎంత అవుతుంది. ఇంటి కోసం లోన్ తీసుకున్నట్లయితే…ప్రతి నెలా ఈఎంఐ ఎంత కట్టాలన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. ఇలా చేస్తే మీరు సంపాదించిన దాంట్లో నుంచి ఈఎంఐకు కొంత చెల్లిస్తే కొంత పొదుపు చేసుకోవచ్చు.

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, మీరు మీ కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి.