Black Diamond Apples : నల్ల యాపిల్స్ .. స్పెషాలిటీ తెలుసా ?

Black Diamond Apples : ‘‘యాపిల్స్‌‌నందు ఈ యాపిల్స్ వేరయా.. యాపిల్స్ తినేద్దామ.. తిండిపోతు మామ’’ అన్న చందంగా ఈ కొత్త యాపిల్స్ ఉన్నాయి.

  • Written By:
  • Updated On - November 18, 2023 / 03:26 PM IST

Black Diamond Apples : ‘‘యాపిల్స్‌‌నందు ఈ యాపిల్స్ వేరయా.. యాపిల్స్ తినేద్దామ.. తిండిపోతు మామ’’ అన్న చందంగా ఈ కొత్త యాపిల్స్ ఉన్నాయి. సాధారణంగా యాపిల్స్ రెడ్, పింక్, గ్రీన్ కలర్స్‌లో ఉంటాయి. కానీ ఈ యాపిల్స్ బ్లాక్ కలర్‌లో.. వంకాయల్లా తళతళలాడుతున్నాయి.  ఈ యాపిల్స్ ప్రపంచంలోనే స్పెషల్. ఎందుకంటే ఇవి అన్నిచోట్లా కాయవు. కేవలం చైనా, టిబెట్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఇవి పండుతాయి. కలర్‌కు తగ్గట్టుగానే వీటికి ‘బ్లాక్‌ డైమండ్‌ యాపిల్స్‌‌’ అనే పేరు వచ్చింది. పైకి నల్లగా ఉన్నా.. లోపల మాత్రం ఈ యాపిల్స్ రంగు తెలుపులో ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

రంగు బ్లాక్ అయితేనేం.. ఎర్ర యాపిల్ కంటే దీని రంగే ఎక్కువ. ఎందుకంటే ఇవి చాలా తక్కువ పండుతాయి. వీటిలో ఉన్న ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ. ఒక ‘బ్లాక్‌ డైమండ్‌ యాపిల్స్‌‌’ ధర ఎంతో తెలుసా ? రూ.500 !!  సాధారణంగా యాపిల్‌ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెడతాయి. అయితే బ్లాక్‌ యాపిల్‌ తొలి పంట చేతికందడానికే దాదాపు 8 సంవత్సరాల టైమ్ పడుతుంది. ‘బ్లాక్‌ డైమండ్‌ యాపిల్స్‌‌’‌లో ప్రోటీన్స్‌ అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఫైబర్‌, ఇతర పోషకాలు(Black Diamond Apples) కూడా ఉంటాయి.

Also Read: Netanyahu Vs Unnithan : నెతన్యాహును కాల్చి చంపేయాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు