Site icon HashtagU Telugu

Bill Gates: ఎలక్ట్రిక్‌ ఆటోలో దూసుకెళ్లిన బిల్ గేట్స్.. వీడియో వైరల్

Bill

Bill

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఆయన సంపన్నుడైనప్పటికీ ఓ సామాన్యుడిలా వ్యవహరిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. అయితే  ఇటీవల భారత్‌లో పర్యటించిన సమయంలో మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా తయారీ కేంద్రంలో త్రిచక్రవాహనాన్ని నడిపారు. ఆ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. మరోసారి భారత్‌కు వచ్చిన సమయంలో మీరు, నేను, సచిన్‌ తెందూల్కర్‌ కలిసి.. త్రీ వీలర్‌ డ్రాగ్‌ రేస్‌లో పోటీ పడదామంటూ సరదాగా ప్రతిపాదించారు. ఒకసారి ఛార్జింగ్‌తో దాదాపు 131 కి.మీల వరకు ప్రయాణించే ఓ ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాను నడిపానంటూ బిల్‌ గేట్స్‌ సంబంధిత వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.