Site icon HashtagU Telugu

Bihar Varsity: బీహార్ విద్యార్థికి 100కు 151 మార్కులు

Bihar University

Bihar University

వంద‌కు వంద మార్కులు సాధించిన స్టూడెంట్స్ ను చూశాం. వంద‌కు 151 మార్కులు సాధించిన విద్యార్థిని ఎప్పుడైనా ప్ర‌పంచంలో చూశారా? బీహార్ స్టూడెంట్ 100కు 151 మార్కులు సాధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళితే, బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం (LNMU) అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఒక పేపర్‌లో 100కి 151 సాధించి ఆశ్చర్యపరిచాడు.
వర్సిటీలో పార్ట్-2 పరీక్షలో బీఏ(ఆనర్స్) విద్యార్థి తన పొలిటికల్ సైన్స్ పేపర్-4లో 151 మార్కులు సాధించినట్లు ఆదివారం తెలిపారు.
“ఫలితాలను చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఇది తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ, ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దాన్ని తనిఖీ చేసి ఉండాలి, ”అని ఆయన అన్నారు.
బికామ్ పార్ట్-2 పరీక్షలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ పేపర్-4లో సున్నా సాధించిన మరో విద్యార్థి తదుపరి తరగతికి పదోన్నతి పొందాడు. “ఇది టైపింగ్ లోపం అని విశ్వవిద్యాలయం అంగీకరించింది. వారు నాకు సవరించిన మార్క్ షీట్‌ను జారీ చేసారు,” అని అతను చెప్పాడు. రెండు మార్క్‌షీట్‌లలో టైపింగ్ లోపాలున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.

“టైపోగ్రాఫికల్ లోపాలను సరిదిద్దిన తర్వాత, ఇద్దరు విద్యార్థులకు కొత్త మార్కు షీట్లు జారీ చేయబడ్డాయి. అవి కేవలం టైపోగ్రాఫికల్ లోపాలు, మరేమీ కాదు, ”అని అతను చెప్పాడు.