Site icon HashtagU Telugu

Costliest Veggie: ఈ కూరగాయలు కిలో పండిస్తే రూ.లక్ష లాభమట.. అత్యంత ఖరీదైన పంట ఇదే?

Hop Shoots

Hop Shoots

సాధారణంగా మనం ఎన్నో రకాల పంటలు పండిస్తూ ఉంటాం అయితే ఇలా పంటలు వేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టాలు రావడం లేదంటే పొలం మొత్తానికి కలిపి వేల రూపాయలలో లాభం రావడం మనం చూస్తుంటాము. కానీ కేవలం ఒక కిలో కూరగాయలు పండిస్తేనే లక్ష రూపాయల లాభం వస్తుందనే విషయం ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇలా కిలో కూరగాయలపై ఏకంగా లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతున్న పంట ఏది అనే విషయానికి వస్తే…

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ లోని ఔరంగాబాద్‌లో ఉన్న నవీనగర్‌ బ్లాక్‌ కరండిహ్‌ గ్రామంలో అమ్రేష్‌ అనే వ్యక్తి హాప్‌ షూట్స్‌ అనే ఓ రకమైన మూలికల పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటకు ఐరోపాదేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్కువగా ఈ పంటను ఔషధాల తయారీలోనూ అలాగే మూలికల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ పంట నుంచి వచ్చే ఆకులు, కాయలు, కొమ్మలు సైతం వివిధ రకాల ఔషధాల తయారీలో ఉపయోగించడంతో ఈ పంటకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది.

ఈ విధంగా ఆమ్రేష్ వారణాసిలోని ఇండియన్‌ వెజిటబుల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ లాల్‌ సూచన మేరకు ఈ పంట సాగు చేశారు. అయితే ఆమ్రేష్ ఈ పంట పండిస్తున్న సమయంలో గ్రామస్తులు మొత్తం ఏదో పిచ్చి పంట వేస్తున్నాడనీ హేళన చేస్తూ నవ్వుకున్నారు. అయితే ఆయన ఈ పంట ద్వారా పొందిన ఆదాయం చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇలా ఒక కిలో పంటకు లక్షల్లో ఆదాయం పొందడంతో ఇతర రైతులు సైతం ఈ పంటను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Exit mobile version