Rajasthan: బరాన్ లో 250మంది దళితులు హిందూమతాన్ని విడిచి బౌద్ధమతం స్వీకరించారు…కారణమేంటో తెలుసా..?

టెక్నాలజీ రాకెట్ లా దుసుకుపోతున్న ఈరోజుల్లో కూడా చాలా మంది కులాలు, మతాల పట్టింపుల పంతాలు మాత్రం ఏమాత్రం వీడటం లేదు.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 07:21 PM IST

టెక్నాలజీ రాకెట్ లా దుసుకుపోతున్న ఈరోజుల్లో కూడా చాలా మంది కులాలు, మతాల పట్టింపుల పంతాలు మాత్రం ఏమాత్రం వీడటం లేదు. దేశంలో ఏదొక మూలన కలుం పేరిట దాడులు, పరువు హత్యలు, బహిష్కరణలు జరగడం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలో భూలోనే అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 250 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ 250 కుటుంబాలు శుక్రవారం హిందూ మతాన్ని త్యజించి బౌద్ధమతం స్వీకరించాయి. అంతేకాదు దేవతామూర్తుల విగ్రహాలు, చిత్రపటాలను ఇళ్లలోనుంచి తీసి బేత్లీ నదిలో నిమజ్జనం చేశారు. ఎందుకిలా చేశారు. హిందూ మతాన్ని మరడానికి కారణమేంటీ తెలుసుకుందాం.

అక్టోబర్ 5న భూలోన్ గ్రామంలో దుర్గాదేవిని ప్రతిష్టించారు. అక్కడ 9రోజుల పాటు నిత్యం పూజలు నిర్వహించారు. అయితే దుర్గాదేవి హారతిని దళితులు తీసుకున్నారన్న నెపంతో ఆగ్రహించిన గ్రామ సర్పంచ్ తోపాటు మరో ఇద్దరు దళిత యువకులిద్దరినీ దారుణంగా కొట్టారు. అగ్రవర్ణాలు తమపై దాడి చేశారంటూ ఆ యువకులిద్దరూ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా అధికార యంత్రాంగాన్ని వేడుకున్నారు. అయినా వారి బాధను పోలీసులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోలేదు. తమపై దాడికి పాల్పడిన గ్రామ సర్పంచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేరు.

తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ గ్రామసర్పంచ్…దళితులపై వేధింపులకు దిగారు. దీంతో ఆగ్రహం చెందిన దళితులు దేవుళ్ల విగ్రహాలు, చిత్ర పటాలతో గ్రామంలో వీధుల గుండా ర్యాలీ వెళ్లి, బెత్లీ నదికి చేరుకున్నారు. అక్కడ నదిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పిన 22 ప్రమాణాలు చేశారు. హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరిస్తామని ప్రమాణం చేశారు.

గ్రామంలోని దళితులందరినీ చంపుతామని..గ్రామంలో నుంచి బహిష్కరిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బల్ముకంద్ బైర్వా అనే దళితుడు తెలిపాడు. తమపై దాడిని చేసిన వారిని అరెస్ట్ చేయకుంటే సబ్ డివిజన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని..తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేద వ్యక్తం చేశారు.