ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు గొడవ పడ్డారు. ప్రిన్సిపాల్ ను తీవ్రంగా కొట్టి..గొంతు నులిమింది తోటి ఉపాధ్యాయురాలు. ప్రిన్సిపాల్ స్పృహ తప్పి పడిపోగానే అక్కడి నుంచి పరార్ అయ్యింది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
అసలు విషయం ఏంటంటే…బారాబంకిలోని దేవా డెవలప్ మెంట్ బ్లాక్ లోసి సిశ్వారా పాఠశాల ఉంది. ఓ ఉపాధ్యాయురాలు ఎలాంటి కారణం లేకుండా ప్రతిరోజూ విద్యార్థులను చితకబాదుతుండేది. శనివారం కూడా విద్యార్థులను కొడుతుండగా..క్లాస్ రూంకు చేరుకున్న ప్రిన్సిపాల్ ఆమెను అడ్డుకుంది. కారణం లేకుండా విద్యార్థులను ఎందుకు కొడుతున్నావ్ అంటూ ప్రశ్నించింది. దీంతో కోపోద్రుక్తురాలైన క్లాస్ టీచర్ ప్రిన్సిపాల్ పై ఎదురు దాడికి దిగింది. ప్రిన్సిపాల్ ను చెప్పుతో కొట్టడమే కాకుండా…గొంతు నులిమింది. దీంతో ప్రిన్సిపాల్ అపస్మారక స్థితికిలో వెళ్లిపోయింది. గొడవ చూసిన తోటి ఉపాధ్యాయులు వచ్చేసరికి…అక్కడి నుంచి పరార్ అయ్యింది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూసినా వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.