Employment : దేశంలో అత్యధిక జాబ్స్ అందించే సిటీ అదే ప్రతి నిరుద్యోగి చేరుకునే గమ్యస్థానం ఇదే..!!

ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో బెంగుళూరు ఉంది. ఉపాధి అవకాశాల్లోనూ ముందుంది. ముఖ్యంగా ఐటి, ఇ-కామర్స్, ఎఫ్‌ఎంసిజి ఇలా మరెన్నో రంగాలలో డిమాండ్ కారణంగా బెంగళూరులో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 05:00 PM IST

ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో బెంగుళూరు ఉంది. ఉపాధి అవకాశాల్లోనూ ముందుంది. ముఖ్యంగా ఐటి, ఇ-కామర్స్, ఎఫ్‌ఎంసిజి ఇలా మరెన్నో రంగాలలో డిమాండ్ కారణంగా బెంగళూరులో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో ఉపాధి కల్పనలో బెంగళూరు దేశంలోనే నంబర్ వన్ నగరంగా నిలిచింది. హెచ్‌ఆర్ కంపెనీ టీమ్‌లీజ్ సర్వీసెస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ‘ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్’ని రిలీజ్ చేసింది. దీనిలో బెంగళూరులోని 95 శాతం కంపెనీలు మునుపటి కంటే ఎక్కువ రిక్రూట్‌మెంట్ చేయాలనుకుంటున్నాయని వెల్లడించింది. ఏప్రిల్-జూన్ మధ్య ఈ సంఖ్య 91 శాతం ఉండగా. . జాతీయంగా ఈ సంఖ్య 61 శాతానికి చేరుకుందని వివరించింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే ఏడు శాతం ఎక్కువని కంపెనీ తెలిపింది. బెంగళూరు తర్వాత ఎక్కువగా ఢిల్లీలో 72 శాతం, ముంబైలో 59 శాతం, చెన్నైలో 55 శాతం మంది గతంలో కంటే ఎక్కువ రిక్రూట్‌మెంట్లు చేసుకుంటున్నట్లు రిపోర్టు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ 177 పోస్టులతో కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం

ఈ రంగాలలో అత్యధిక నియామకాలు:
బెంగళూరులోని తయారీ సేవా రంగాలలోని కంపెనీలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పట్ల సానుకూలంగా ఉందని కంపెనీ తన రిపోర్టులో పేర్కొంది. తయారీరంగంలో ప్రధాన పరిశ్రమలు FMCG 48శాతం, Health care 43శాతం, ఇంజనీరింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్షర్ 38శాతం, ఎనర్జీ 34శాతం అగ్రోకెమికల్స్ 30శాతం రిక్రూట్ చేసుకుంటున్నట్లు తెలిపింది. సేవా రంగం నుండి ప్రముఖ పరిశ్రమలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 97 శాతం, ఇ-కామర్స్, స్టార్టప్‌లు 85 శాతం, విద్యా సేవలు 70 శాతం, టెలికమ్యూనికేషన్స్ 60 శాతం, రిటైల్ 64 శాతం ఆర్థిక సేవల కంపెనీలు 55 శాతం ఉన్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ భట్ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో బెంగళూరు అన్ని రంగాల్లో భారీ బూమ్‌ను సాధించింది. ఈ సమయంలో చాలా కంపెనీలు పుట్టుకొచ్చాయి. వచ్చే త్రైమాసికంలో ఇది 97 శాతానికి పెరగవచ్చని ఆయన అన్నారు.

టీమ్‌లీజ్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్ అంటే ఏమిటి?
టీమ్‌లీజ్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ నివేదికకు సంబంధించి, 14 నగరాల్లోని 23 రంగాల్లోని 865 మంది కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఇది తయారు చేయబడింది. ఇది కంపెనీల పాలసీలు హైరింగ్ సెంటిమెంట్ గురించి వివరిస్తుంది. నివేదికలో పేర్కొన్నట్లుగా జూలై 2022-సెప్టెంబర్ 2022కి సంబంధించిన డేటా ఏప్రిల్. మే మధ్య నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు.