Trash Pouch: ఈ చెత్త బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఈ బ్యాగ్ ఎందుకంత ఖరీదు అంటే?

సాధారణంగా మనం ఇంట్లో చెత్తను బయట పారేయడానికి డస్ట్ బిన్లను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే సిటీలలో అయితే

  • Written By:
  • Publish Date - August 7, 2022 / 12:10 PM IST

సాధారణంగా మనం ఇంట్లో చెత్తను బయట పారేయడానికి డస్ట్ బిన్లను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే సిటీలలో అయితే డస్ట్ బిన్లు లేదంటే వీధి చివర్లో ఉన్న మున్సిపాలిటీ డస్ట్ బిన్లలో వేస్తూ ఉంటారు. కానీ ఇతర దేశాలలో మాత్రం డస్ట్ బిన్లకు బదులుగా పెద్ద పెద్ద కవర్లను ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో స్పెయిన్‌కు చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ Balenciaga. అయితే ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి డిమాండ్ ఉంది. అత్యంత ఖరీదైన ఈ బ్రాండ్ ఉత్పత్తులను ఎంతో మంది ప్రముఖులు కూడా వినియోగిస్తుంటారు. తాజాగా ఈ బ్రాండ్ ఓ చెత్త బ్యాగ్ ను రూపొందించింది.

అయితే ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాలా 1800 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.1.42 లక్షలు. ఏంటి ఒక చెత్త బ్యాగు కి అంత డబ్బా అని ఆశ్చర్య పోతున్నారా! మీరు విన్నది నిజమే అక్కడివారు ఇంత ఖరీదైన బ్యాగులను ఉపయోగిస్తూ ఉంటారట. కాగా ఈ బ్యాగ్ నలుపు, తెలుపు, ఎరుపు, నీలం రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ ట్రాష్ బ్యాగ్‌ను దూడ యొక్క చర్మంతో తయారు చేస్తారట. ఈ బ్యాగ్‌ను ఈ ఏడాది మార్చిలో పారిస్‌లోని రెడీ టు వేర్ కలెక్షన్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ బ్రాండ్‌కు సంబంధించిన స్టోర్‌లలో ఆ బ్యాగ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెత్త బ్యాగ్‌ని తయారు చేసే అవకాశాన్ని నేను కోల్పోలేను. ఎందుకంటే ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఎవరు ఇష్టపడరు? అని Balenciagas క్రియేటివ్ డైరెక్టర్ డెమ్న జీవశాలియా పేర్కొన్నారు. కాగా, చెత్త బ్యాగ్ ఖరీదుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తు అత్యంత ఖరీదైన డిజైనర్ ట్రాష్ బ్యాగ్‌ను వాడాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ విషయం పట్ల మండిపడుతున్నారు.