Site icon HashtagU Telugu

UP : అబ్బాయి 2.3అడుగులు, అమ్మాయి 3 అడుగులు, ఘనంగా వివాహం..!!

Azeem (1)

Azeem (1)

యూపీలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం ఘనంగా జరిగింది. కైరానాలో నివాసం ఉంటున్న అజీమ్ మన్సూరీకి హాపూర్ కు చెందిన బుష్రాతో బుధవారం ఘనంగా పెళ్లి జరిగింది. 27ఏళ్ల అజీమ్ 2.3 అడుగులు, బుష్కా ఎత్తు 3 అడుగులు. పెళ్లి తర్వాత వీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. కైరానా నుంచి హాపూర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

కాగా బుష్రా బికామ్ చదువుతోది. తనకు అజీమ్ అంటే చాలా ఇష్టమని బుష్రా చెబుతోంది. బుష్రా, అజీమ్ ల వివాహం గత నెలలో ఫిక్స్ అయ్యింది. కాగా అజీమ్ సోషల్ మీడియాలో చాలా పూపులర్. వీరి పెళ్లిని చూసేందుకు పెద్దెత్తున జనాలు వచ్చారు. ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా బుష్రా ఫ్యామిలీ పోలీసుల సాయం కోరింది. దీంతో పోలీసులు బుష్రా ఇంటి వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. వివాహం పూర్తయ్యేంత వరకు పోలీసులు అక్కడే ఉన్నారు.