Site icon HashtagU Telugu

Ayodhya Deepotsav: నేడు అయోధ్య దీపోత్సవానికి ప్రధాని హాజరు. 5 ప్రత్యేక దీపాలను వెలిగించనున్న మోదీ..!!

Ayodhya

Ayodhya

అయోధ్యలో ఈసారి దీపావళి ప్రత్యేకంగా ఉండబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు రాంలీలా విరామజమాన్ ముందు 5 ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలు పంచతత్వ ( నీరు,ఆకాశం, అగ్ని, గాలి, భూమి) చిహ్నాలుగా ఉంటాయి. దీపోత్సవం తర్వాత నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి స్థలంలో ఏర్పాటు చేసిన ధర్మధ్వజ్ ముందు కూడా ప్రధాని దీపం వెలిగించనున్నారు. గర్భగుడిలో ఏర్పాటు చేసిన మతజెండా ముందు ఉదయం, సాయంత్రం పూజలు చేయనున్నారు. కాగా సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపోత్సవ్ ను ప్రారంభించనున్నారు.

కాగా తొలిసారిగా అయోధ్య దీపోత్సవ్ కు ప్రధాని హాజరకావడంతో రామభక్తుల్లో ఆనందం, ఉత్సాహం నెలకొంది. దీపోత్సవం కోసం రాముడి పాదం మీద నిర్మిస్తున్న ప్రధాన వేదికపై మోదీ,గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ జాతీయ పక్షి నెమలి రూపంలో తయారు చేసిన దీపాన్ని వెలిగించి వేడుకలను ప్రారంభిస్తారు.

ఈ దీపాన్ని అవధ్ యూనివర్సిటీలోని ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు తయారు చేశారు. ఈ దీపోత్సవంలో 17లక్షల దీపాలను వెలగించనున్నారు. అంతేకాదు దీపోత్సవం సందర్భంగా రామజన్మభూమిలో ప్రత్యేక పుష్ఫాలంకరణ చేశారు. విదేశాల నుంచి ప్రత్యేక పుష్ఫాలను తప్పించారు. కాగా ఈ దీపోత్సవంలో 22000మందికి పైగా వాలంటీర్లు తమ సేవలను అందించనున్నారు.

Exit mobile version