World With 3 Suns: ఏకంగా 3 సూర్యులతో సౌర వ్యవస్థ.. తొలిసారి గుర్తింపు!!

నిజానికి మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మిగిలిన నక్షత్రాలతో పోల్చి చూసినప్పుడు సూర్యుడు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం కాబట్టి పెద్ద బింబంలా, అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

  • Written By:
  • Publish Date - July 25, 2022 / 08:30 AM IST

నిజానికి మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మిగిలిన నక్షత్రాలతో పోల్చి చూసినప్పుడు సూర్యుడు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం కాబట్టి పెద్ద బింబంలా, అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దూరంలో ఉండే నక్షత్రాల సైజు చిన్నగా.. వెలుతురు మసకగా కనిపిస్తుంది. ఇక తాజా విషయంలోకి వెళదాం.. సూర్యుడి చుట్టూ గ్రహాలతో కూడిన సౌర వ్యవస్థ ఉంటుందనే విషయం మనకు తెలుసు. కానీ ఒకే సౌర వ్యవస్థలో నాలుగు సూర్యులు ఉంటే ఓ అద్భుతం. అరుదైన ఘట్టం. ఈవిధంగా మొత్తం నాలుగు సూర్యులు కలిగిన ఒక వైవిధ్యమైన సౌర వ్యవస్థను డెన్మార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్ హగెన్ కు చెందిన నీల్సన్ బోర్ పరిశోధకులు గుర్తించారు. ఆ 4 సూర్యుళ్లలో ఒక సూర్యుడిని మిగతా మూడు సూర్యుళ్లు కలిసి చాలా కాలం క్రితం
కబళించాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం ముగ్గురు సూర్యుళ్లను కలిగి ఉన్న ఈ అరుదైన సౌర వ్యవస్థ పరస్పరం సన్నిహితంగా అతుక్కుపోయినట్లు కనిపిస్తుందని చెప్పారు. ఈ అరుదైన వ్యవస్థలో ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమించే రెండు బైనరీ నక్షత్రాలు ఉన్నాయని వివరించారు. మరో పెద్ద నక్షత్రం .. ఈ రెండు బైనరీ నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తోందని పరిశోధకులు చెప్పారు.

ఎక్కడ.. ఎలా?

భూమికి 150 కాంతి సంవత్సరాల దూరంలో “టీడబ్ల్యు హైడ్రా” నక్షత్ర రాశిలో ఈ విభిన్నమైన సౌర వ్యవస్థ ఉందని సైంటిస్టులు తెలిపారు. దీనికి “హెచ్‌డీ 98800” అని పేరు పెట్టారు. బైనరీ నక్షత్రాలు భూమి లాగే 24 గంటల్లో ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండు సూర్యులు (నక్షత్రాలు) కలిసి మన సూర్యుడి కన్నా 12 రెట్లకు పైగా ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయని తెలిపారు. ఇలాంటి త్రీ స్టార్స్ వ్యవస్థను కనుగొనడం ఇదే తొలిసారి. ఇంతకుముందే మనకు త్రీ స్టార్స్‌తో కూడిన అంతరిక్ష వ్యవస్థలు తెలుసు కానీ అవన్నీ తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండేవి. ఈ సరికొత్త 3 నక్షత్రాల వ్యవస్థలోని నక్షత్రాలు చాలా భారీ తనంతో ఉన్నాయి.