పర్యాటక పాలకోవా…అందాల గోవాలో ఎక్కుడ చూసినా వినిపించే సముద్రపు అలల సవ్వడులు. తీరం మీదుగా వీచే పిల్లగాలులు. సముద్ర తీరుపు అందాలను ఎంత చూసిన తన్నితీరదు. పర్యాటక రాజధానిగా పేరుగాంచిన గోవా అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి గోవా అందాలను మీరూ చూడాలనుకుంటుున్నారా.? అయితే IRCTCతో మీ ప్లాన్ రెడీ చేసుకోండి. ఇక్కడ చేయాల్సిందల్లా మీ సీటును బుక్ చేసుకోవడం. అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న బెస్ట్ ప్యాకేజీ వివరాలు ఇక్కడ ఉన్నాయి తెలుసుకోండి.
ప్యాకేజీ వివరాలు:
ప్యాకేజీ పేరు- గోవాన్ డిలైట్
ప్యాకేజీ వ్యవధి – 3 రాత్రులు, 4 రోజులు
ప్రయాణ మోడ్ – ప్లైట్
ప్రదేశాలు- ఉత్తర గోవా, దక్షిణ గోవా
హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకుంటే 24 నవంబర్ నుంచి 2022 అందుబాటులో ఉన్నాయి.
Explore delightful Goa & its cuisine with IRCTC's Air tour package starting from ₹20980/- onwards. For details, visit https://t.co/IEX1iBd4pO @AmritMahotsav #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) September 19, 2022
మీరు ఈ సదుపాయాన్ని పొందుతారు:
1. ఇక్కడికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
2. బస చేయడానికి 3 స్టార్ హోటల్ సౌకర్యం అందుబాటులో ఉంటాయి.
2. 3 అల్పాహారం, 3 రాత్రి భోజనం సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
3. రోమింగ్ కోసం AC వాహనం సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
4. మీరు ప్రయాణ బీమా సౌకర్యం కూడా పొందుతారు.
ప్రయాణానికి చెల్లించాల్సిన ఫీజు:
1 . ఈ ట్రిప్‌లో ఒంటరిగా ప్రయాణిస్తే రూ.27,330 చెల్లించాల్సి ఉంటుంది.
2 . ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.21,455 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
3 . ఒక్కొక్కరికి రూ.20,980 చొప్పున ముగ్గురు వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది.
4 . పిల్లలకు మీరు ప్రత్యేక రుసుము చెల్లించాలి.
మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు:
మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయండి.