యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ జీవిత విశేషాలు అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్. ఇక ఆయన వినియోగించిన టెక్ టూల్స్ గురించి తెలుసుకోవాలని అందరూ భావిస్తుంటారు. 1976లో యాపిల్-1 కంప్యూటర్ సామర్ధ్యాన్ని డెమో ఇచ్చేందుకు యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ వాడిన యాపిల్-1 కంప్యూటర్ ప్రొటోటైప్‌ను వేలానికి ఉంచారు. వేలంలో ఈ అరుదైన డివైజ్ దాదాపు రూ 4 కోట్లు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్ఆర్ ఆక్షన్ హౌస్‌లో దీన్ని వేలానికి పెట్టగా ఇప్పటికే ఆరంభ బిడ్లు రూ.కోటిన్నరకు వచ్చాయి.ఆగస్ట్ 18 వరకూ వేలం జరగనుండటంతో పాతతరం యాపిల్-1 కంప్యూటర్ భారీ ధర పలుకుతుందని భావిస్తున్నారు.
యాపిల్-1 కంప్యూటర్ ప్రొటోటైప్ గురించి..
స్టీవ్ జాబ్స్ తన లాస్ అల్టోస్ ఇంటిలో తన భాగస్వాములు స్టీవ్ వొజ్‌నియక్, ప్యాటీ జాబ్స్, డేనియల్ కోట్కేతో కలిసి డిజైన్ చేసిన 200 డివైజ్‌ల్లో ఇది ఒకటి. కొన్నేండ్ల పాటు యాపిల్ గ్యారేజీ ప్రాపర్టీలో ఈ ప్రొటోటైప్ పడి ఉంది. మూడు దశాబ్ధాల కిందట స్టీవ్ జాబ్స్ స్వయంగా దీన్ని ఓ వ్యక్తికి అందించాడు. పరికరం సరైన రీతిలో లేదని, కొన్ని పార్ట్స్‌ను ఇతర యాపిల్-1 కంప్యూటర్స్ కోసం స్టీవ్ జాబ్స్ తొలగించాడని తెలిపింది. వేలంలో యాపిల్-1 కంప్యూటర్స్ వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. న్యూయార్క్ హౌస్‌కు చెందిన యాపిల్-1 కంప్యూటర్ ను 2014లో ఏకంగా రూ.7.50 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు.