Anand Mahindra: భారత మహిళల శక్తి ముందు ప్రపంచం వెనకబడింది…మహిళా శక్తికి సెల్యూట్…!!

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 07:33 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసే ప్రేరణాత్మక ట్వీట్లు వైరల్ అవుతుంటాయి. ఆనంద్ మహీంద్రాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. నెటిజన్లు చేసే కామెంట్లకు ఆయన చాలా ఓపికతో రిప్లేకూడా ఇస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

భారత్ అత్యంతగా వేగంగా డెవలప్ అవుతోంది. ఆర్థిక వ్యవస్థతోపాటు ఇతర రంగాల్లోనూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. అలాంటి రంగాలో ఒకటి ఏవిషియేషన్. భారత మహిళా శక్తి ఎక్కడ ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిసిక్స్ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వాస్తవానికి మహిళా వాణిజ్య పైలట్ల సంఖ్య పరంగా భారత్ మొదటిస్థానంలో ఉంది. ఈ ఘనత సాధించిన మహిళా శక్తికి నా సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.

ఇలా క్యాప్షన్ ఇచ్చారు.
భారత మహిళా శక్తికి సెల్యూట్. “వీకెండ్ జోష్ ” పొందడానికి ఏదైనా సెర్చ్ చేస్తున్నారా.? హల్ వరల్డ్, నారీ శక్తి పనిలో ఉంది ” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ పై భారత మహిళలను ప్రశంసిస్తూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ లో ఆనంద్ మహీంద్రా పంచుకున్న గణాంకాల ప్రకారం అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, జపాన్ తోపాటు ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో మహిళా వాణిజ్య పైలట్ల సంఖ్య 12.4 శాతం ఎక్కువ.

తన ట్వీట్ లో #MidweekMomentum అని జోడించారు. 12.4 శాతం కమర్షియల్ పైలట్లతో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. 9.9శాతం ఐర్లాండ్ రెండో స్థానం, ఇతర దేశాల్లో మహిళా పైలట్ల సంఖ్యను పరిశీలిస్తే, దక్షిణాఫ్రికా 9.8%, ఆస్ట్రేలియా 7.5%, కెనడా 7.0%, జర్మనీ 6.9%, USA 5.5%, UK 4.7%, న్యూజిలాండ్ 4.5%, జపాన్1.3 % శాతంగా ఉందంటూ పోస్టు చేశారు.