Site icon HashtagU Telugu

Anaconda: వైరల్ వీడియో.. నీళ్లలో అనకొండ.. చూడటానికి వెళ్లిన వ్యక్తి.. చివరికి?

Anaconda

Anaconda

సాధారణంగా పాములు లేదా అనకొండ లాంటివి చూసినప్పుడు భయంతో పరుగులు తీస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం ఎటువంటి భయం లేకుండా వాటిని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది లేనిపోని ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలను పణంగా పెడుతూ ఉంటాడు. ఇక చాలామంది ఫారెనర్స్ అయితే ఈ అనకొండ లను, పాములను పెంచుతూ ఉంటారు. కాగా నిత్యం సోషల్ మీడియాలో ఇలా సరిసృపాలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే కొన్ని కొన్ని సార్లు ఆ వీడియోలు ఒళ్ళు గర్గుర్పొడిచే విధంగా ఉంటాయి. చాలామంది అనకొండలు అయినా విష సర్పాలనైన ఈజీగా చేతులతో పట్టుకుంటూ ఉంటారు. అనకొండ విషయానికి వస్తే.. చూడటానికి పాముల కంటే రెండు మూడు ఇంతలు పెద్దదిగా ఉండి ఎటువంటి జీవిని అయినా అమాంతం మింగేయగలవు. ముందుగా వాటికి ఆహారం దొరికింది అంటే చాలు వాటి శరీరంతో ఆ జీవి యొక్క శరీరాన్ని చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తాయి.nఅనకొండలు సాధారణంగా చిత్తడి నేలలు, చిత్తడి నేలలు మరియు నెమ్మదిగా కదులుతున్న ప్రవాహాలలో, ప్రధానంగా అమెజాన్ బేసిన్‌లోని ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి.

 

అవి భూమిపై గజిబిజిగా ఉంటాయి. ఈ అనకొండలు అడవి పందులు, జింకలు, పక్షులు, తాబేళ్లు మరియు జాగ్వర్లను కూడా వేటాడతాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చెక్కర్లు కొడుతుంది. ఒక వ్యక్తి నీటిలో ప్రయాణిస్తూ ఉండగా ఇంతలోనే అనుకోకుండా రెండు దుంగల మధ్యలో ఒక భారీ అనకొండ కనిపిస్తుంది. వెంటనే అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అతడు ఆ రెండు దుంగల మధ్య ఉన్న ఆ భారీ అనుకొండను మొబైల్ తో రికార్డ్ చేస్తూ ఉండగా అనుకోకుండా అది నీటిలో నుంచి ఆ వ్యక్తి పైకి అమాంతంగా కాటు వేయడానికి పైకి ఎగిరింది. దీంతో వ్యక్తి రెప్పపాటులో అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లేదు అంటే ఆ అనకొండకు ఆహారం అయ్యేవాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Exit mobile version