Site icon HashtagU Telugu

China: అదృష్టమంటే వీరిదే..2 లక్షలకు కొనుగోలు చేసిన వస్తువు 72కోట్లకు అమ్ముడుపోయింది..!!

Us Dollor

Us Dollor

ఒక్కోసారి అదృష్ట దేవత ఎలా తలుపు తడుతుందో తెలియదు. ఎందుకు పనికిరాని వస్తువు కూడా కోట్లు సంపాదించి పెడుతుంది. అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. దాదాపు రెండు లక్షల ఖరీదు చేసే చైనీస్ ఫ్లవర్ వాజ్ రూ. 72కోట్లకు అమ్ముడుపోయింది. ఈ జాడీ వేలపాటు కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. సాధారణంగా జాడీని 3వందలు లేదా 4 వందలు పెట్టి కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ చిన్నా జాడీకి ఇంత భారీ మొత్తం ఎలా చెల్లించారో అర్థంకాక దాని యజమాని కూడా ఆశ్చర్యపోయారు. శనివారం పారిస్ లోని ఫోంటైన్ బ్లూలోని ఓసెనాట్ వేలం హౌజ్ ఈ చైనీస్ జాడీని వేలం వేశారు. మొదట్లో దీని ధర ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఉంటుందని భావించారు. అయితే వేలంలో ఈ పురాతన జాడీ రూ. 72కోట్లకు అమ్ముడుపోయింది.

బ్లూ అండ్ వైట్ Tianqiuping అసలు ధర కేంటే కొన్ని వేల రేట్లు అధిక ధరకు అమ్ముడుపోయింది. ఈ వేలం పాట తన జీవితాన్ని మార్చేసిందని జాడీ యజమాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ జాడీని తన అమ్మమ్మ ఇంటి నుంచి తీసుకువచ్చినట్లు తెలిపాడు. ఈ జాడీ యజమాని వాళ్ల అమ్మమ్మకు కళ అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే దాన్ని తయారు చేయించందట. దాదాపు 30ఏళ్లుగా ఆయన ఇంట్లో ఈ జాడీ ఉంది. కాగా ఈ వేలం పాటలో కేవలం 30మంది మాత్రమే పాల్గొన్నారు. దీన్ని కొనుగోలు చేసింది కూడా చైనా వాసినే. కాగా చైనా కొనుగోలుదారులు ఈ మధ్య కాలంలో చారిత్రక కళాఖండాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు వేలం పాట హౌజ్ తెలిపింది.

Exit mobile version