Site icon HashtagU Telugu

Abducted by Aliens: నన్ను, నా భార్యను ఏలియన్స్ ఎత్తుకెళ్లారు.. అందుకే భవిష్యత్తు చెబుతున్న?

Alien Abduction

Alien Abduction

మామూలుగా గ్రహాంతరవాసుల అంశానికి సంబంధించి మూడు రకాలుగా మనుషులు ఉన్నారు. అందులో మొదటి రకం తమను ఏలియన్స్ ఎత్తుకెళ్లారు అని చెబుతూ ఉంటారు. ఇక రెండవ రకం వారిని ఏలియన్స్ ఎత్తుకెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. మూడవ రకం ఏలియన్స్ ఏ లేరు అని కొట్టి పడేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి మొదటి రకానికి చెందినవారు. అతని పేరు డాక్టర్ లూయిస్ తురి. అయితే 1991 లాస్ట్ ఏంజిల్స్ లో గ్రహాంతరవాసులు అతనిని అతని భార్యని ఎత్తుకెళ్లారని ఆయన చెబుతున్నారు.

అంతే కాకుండా ఆ తర్వాత నుంచి తనకు భవిష్యత్తు ముందే తెలిసిపోతుందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మమ్మల్ని ఆ ఏలియన్స్ ఎత్తుకెళ్లిన తర్వాతనే నా భార్య కడుపులోని మూడు నెలల బిడ్డను ఆ ఏలియన్స్ తొలగించారు. అంతేకాకుండా నా తలపై హెల్మెట్ లాంటిది పెట్టారు. నా నుంచి అంతరిక్ష రహస్యాలు డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత నా బ్రెయిన్ లో భవిష్యత్తును ఊహించే వారసత్వాన్ని కల్పించారు అని తెలిపారు లూయిస్. అయితే ఇదంతా అబద్ధం కాదని వాస్తవంగానే జరిగింది అని అంటున్నాడు.

అంతే కాకుండా అమెరికాలో వరల్డ్ ట్రేస్ సెంటర్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిని ముందే అంచనా వేశానని ఆయన తెలిపాడు. ఆ సమయంలో తనకు ఉగ్రవాదులకు సంబంధం ఉంది అని తనను ఎఫ్బీఐ వారు ప్రశ్నించారు అని ఆయన తెలిపారు.. అయితే ఈ విషయాలన్నీ కూడా డాక్టర్లు లూయిస్ తురి ఒక డాక్యుమెంటరీలో తెలిపాడు. నేను భవిష్యత్తుని కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నాను అని ఆయన తెలిపారు. అయితే భవిష్యత్తును ఊహించిన ఫ్రాన్స్ తత్వవేత్త నోస్ట్రడామస్ లానే లూయిస్ కూడా ఫ్రాన్స్ కీ చెందినవారు. అయితే అతను విషయాలను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం కొట్టి పడేస్తున్నారు.