Site icon HashtagU Telugu

End of the World : ప్రపంచం అంతమయ్యే ముందు ఇలా ఉంటుందట.. కృత్రిమ మేధ సృష్టించిన భయానక దృశ్యాలివి!

End Of The Worlsd

End Of The Worlsd

ఒకవైపు గ్లోబల్ వార్మింగ్…మరొకవైపు దేశాలమధ్య ఆధిపత్య పోరు, కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాల…ఇలా భూమిమీద పరిస్ధితులు మనుషులు జీవించే పరిస్థితి లేకుండా పోతాయని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. తాజాగా AI చిత్రాలను క్రియేట్ చేసే ప్రోగ్రామ్ కూడా ఇలాంటి భయానక భవిష్యత్తునే అంచనా వేసింది. భూమిపై మనుషుల చివరి సెల్ఫీలు ఎలా ఉంటాయో చూపించాలని అడిగితే….భయభ్రాంతులకు గురి చేసే చిత్రాలను ఆవిష్కరించింది. ఆ చిత్రాలుతో కూడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ప్రస్తుత పరిస్థితులను ముందు ఎదురయ్యే అంశాలను బేరీజు చేసుకుంటూ పని చేసే కంప్యూటర్ ప్రోగ్రాములే ‘కృత్రిమ మేధ అని చెప్పవచ్చు. ఇలాంటి డీఏఎల్ ఎల్ -ఈ2 అనే ఓ AIఇమేజ్ జనరేటర్ తో కొందరు ఓ వినూత్న ప్రయోగం చేశారు. భూమిపై మనుషులు తీసుకునే చివరి సెల్ఫీలు ఎలా ఉంటాయో చూపించు అని కోరాడంతో దానికి అనుగుణంగా ప్రాసెస్ చేసిన చిత్రాలను ఈ ప్రోగ్రామ్ చూపించింది. దాదాపు ప్రళయం వచ్చి అంతమైపోయే చివరిలో ఉన్న పరిస్థితులు ఆ చిత్రాల్లో కనిపించాయి.

మొదట టిక్ టాక్ లో రోబో ఓవర్ లోడ్స్ పేరుతో ఉన్న అకౌంట్ లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఇది నెట్టింట్లో పలు సోషల్ మీడియా సైట్లలో వైరల్ అయ్యింది. ఈ చిత్రాలను వీడియోను చూసిన నెటిజన్లు భయంగా ఉందని…అప్పటికే మనం మరో గ్రహం మీదికి వెళ్లిపోయిఉంటామని మరికొందరు కామెంట్లు చేశారు.

 

Exit mobile version