సాధారణంగా నిద్రలేవాలంటే అలారం సెట్ చేసుకొని నిద్రలేస్తుంటాం. కానీ అలారం బదులు ఏనుగే నిద్రలేపితే భలే ఉంటుంది కదా. ఓ రిసార్ట్ లో ఏనుగులే టూరిస్టులను నిద్రలేపి ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక మహిళ తన హోటల్ గదిలో నిద్రిస్తున్నప్పుడు ఓ ఏనుగు తన తొండంతో నిద్రలేపిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు సంబంధించిన వీడియోను సాక్షి జైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మహిళ తన హోటల్ బెడ్‌పై నిద్రిస్తుండగా ఏనుగు ఆమె గదిలోకి తొంగి చూసింది. అయితే బెడ్ పై నిద్రపోవడంతో గమనించి తొండం తాకించి నిద్రలేపింది. థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయిలో ఉన్న ఈ రిసార్ట్‌లో అలారం బదులుగా ఏనుగులు నిద్రలేపుతున్నాయి. అంతేకాదు.. మనతో వాకింగ్, ఈటింగ్, స్నానం చేసేటప్పుడు కూడా సాయంగా ఉంటాయట.
Elephant Viral Video: అక్కడ ఏనుగులే నిద్రలేపుతాయి.. వీడియో ఇదిగో!

Elephant