Motor Vehicle Act: చెప్పులు వేసుకుని బైక్ నడిపితే భారీ ఫైన్.. ఎందుకో తెలుసా ?

రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్న ఉద్దేశ్యంతో ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ను మరింత కఠినం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీగా ఫైన్లు వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 09:29 AM IST

రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్న ఉద్దేశ్యంతో ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ను మరింత కఠినం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీగా ఫైన్లు వేస్తున్నారు. ఎంత కఠినమైన రూల్స్ అమలు చేసినా…నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయో ఉన్నాయి. అతి వేగం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రూల్స్ తీసుకువచ్చింది.

హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేయడంతో ప్రమాదాలు కొంతమేర తగ్గాయి. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. అందులో టూవీలర్ నడుపుతున్నప్పుడు చెప్పులు వేసుకుని నడిపించడం తప్పు. అలా నడిపించడం మోటార్ వాహన చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. 2019లొ మోటార్ వాహన చట్టంలో సవరణలో ఈ నిబంధనలు చేర్చారు. ఈ కొత్త నిబంధన గురించి తెలుసుకుందాం.

బైక్ నడుపుతున్నప్పుడు షూస్ ధరించడం తప్పనిసరి:
మీరూ టూవీలర్ నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం…టూవీలర్ నడిపేటప్పుడు పాదాలు పూర్తిగా కప్పిఉంచాలి. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు పెద్దగా సమస్య ఉండదు. అందుకే బైక్ నడుపుతుంటే షూస్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇలా చేస్తే స్వీయ రక్షణతోపాటు ట్రాఫిక్ నిబంధనలు కూడా ఉల్లంఘించకుండా ఉండవచ్చు.

మీరు చెప్పులు లేదా చెప్పులు ధరించి స్కూటర్ లేదా మోటార్ సైకిల్ నడుపుతుంటే, అప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, మోటారు వాహన చట్టం ప్రకారం, ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు పాదాలను కప్పి ఉంచాలి. తద్వారా ప్రమాదం సమయంలో పెద్ద సమస్య ఉండదు. బైక్ నడుపుతున్నప్పుడు షూస్ తరచుగా ఉపయోగించాలి.ఇలా చేస్తే స్వీయ రక్షణతో పాటు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఉండదు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. కనీసం 1000 రూపాయల చలాన్‌ను కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే లైసెన్స్‌ను రద్దు చేసే నిబంధనలు కూడా ఉన్నాయి.