Site icon HashtagU Telugu

Delhi Politics : దుమారం రేపుతోన్న ఆప్ మంత్రి వ్యాఖ్యలు..హిందూ దేవుళ్లను పూజించనంటూ..!!

Goutham

Goutham

ఢిల్లీలో అధికారంలోఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందూ దేవతలను అవమానించడంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హిందూ సమాజానికి గౌతమ్ రాజేంద్ర క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. విజయదశమి రోజున, కరోల్‌బాగ్‌లోని రాణి ఝాన్సీ రోడ్డులో ఉన్న అంబేద్కర్ భవన్‌లో రాజేంద్ర పాల్ గౌతమ్ సమక్షంలో ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో కొంతమంది బౌద్ధమతంలోకి దీక్ష తీసుకోవడమే కాకుండా, తాము హిందూ దేవతలను పూజించబోమని, వారిని దేవతలుగా పరిగణించబోమని ప్రమాణం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దీనికి మద్దతు తెలిపారు.

మంత్రి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ఢిల్లీలో సామూహిక మత మార్పిడులు చేస్తున్నారని మేజర్ సురేంద్ర పునియా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ట్యాగ్ చేస్తూ..సనాతన ధర్మాన్ని నిర్మూలించే కాంట్రాక్టును ఎక్కడి నుంచి తీసుకున్నారంటూ ప్రశ్నించారు. హిందువుల విశ్వాసాన్ని అవమానించడమేనని యోగేంద్ర చందౌలియా అన్నారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వ మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి హిందూ వ్యతిరేక మంత్రిని అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్ నుంచి తరిమి కొట్టాలన్నారు.