Toilet Showroom : మహిళా ప్రయాణికులకు ‘టాయిలెట్ షోరూమ్’.. ఫీజు కేవలం రూ.10

Toilet Showroom : టాయిలెట్ వేరు.. షోరూమ్ వేరు.. కానీ టాయిలెట్, షోరూమ్ ఒకేచోట ఉండటమే  ‘వులూ ఉమెన్స్ టాయిలెట్’ (Woloo Women)  ప్రత్యేకత.

Published By: HashtagU Telugu Desk
Toilet Showroom

Toilet Showroom

Toilet Showroom : టాయిలెట్ వేరు.. షోరూమ్ వేరు.. కానీ టాయిలెట్, షోరూమ్ ఒకేచోట ఉండటమే  ‘వులూ ఉమెన్స్ టాయిలెట్’ (Woloo Women)  ప్రత్యేకత. ముంబై లోని ములుంద్ రైల్వే స్టేషన్‌లో ఈ టాయిలెట్ షోరూమ్‌ను ప్రారంభించారు. మహిళా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి దీన్ని ఏర్పాటు చేశారు.  ఇందులో షోరూమ్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా సౌకర్యాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ఫొటోలను సెంట్రల్ రైల్వే ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.  రానున్న రోజుల్లో ఇతర రైల్వే స్టేషన్లలో కూడా వులూ మహిళా మరుగుదొడ్లను ప్రారంభించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • లూమ్ & వీవర్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కలిసి సెంట్రల్ రైల్వే తొలి విడతగా ములుంద్ రైల్వే స్టేషన్‌లో ‘వులూ ఉమెన్స్ టాయిలెట్’‌ను ఏర్పాటు చేయించింది.
  • త్వరలోనే ముంబై డివిజన్ పరిధిలోని ఎల్‌టీటీ, ఘట్‌కోపర్, కంజుర్‌మార్గ్, థానే, మాన్‌ఖుర్డ్, చెంబూర్ అనే మరో ఆరు రైల్వే స్టేషన్‌లలోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ రైల్వే రెడీ అవుతోంది.
  • ప్రతిరోజూ ఈ ఆరు స్టేషన్లలో 75 లక్షల మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. వీరిలో 20 లక్షల మందికిపైగా మహిళా ప్రయాణికులు ఉంటారు.
  • మహిళా ప్రయాణికుల సౌకర్యార్ధమే ‘వులూ ఉమెన్స్ టాయిలెట్’‌లను అందుబాటులోకి తెస్తున్నామని సెంట్రల్ రైల్వే అంటోంది.
  • వులూ మహిళల టాయిలెట్‌లో వైఫై, సెంట్రలైజ్డ్  ఏసీ, ఇంటీరియర్ డెకొరేషన్, యాక్సెస్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్ ఉంటాయి.
  • మహిళా ప్రయాణికులు ఈ టాయిలెట్ సౌకర్యాన్ని రూ.10కే పొందొచ్చు.
  • ప్రయాణికులు కోరుకుంటే రూ.365 వార్షిక చందా కట్టొచ్చు.
  • వులూ టాయిలెట్(Toilet Showroom) మొబైల్ యాప్ కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు.
  Last Updated: 24 Dec 2023, 10:03 AM IST