Site icon HashtagU Telugu

Punjab : పంజాబ్ లో ఘోర ప్రమాదం.రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మృతి..!!

Punjab Train (1)

Punjab Train (1)

పంజాబ్ లో ఘోరప్రమాదం జరిగింది. కిరాత్ పూర్ సాహిబ్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు.  పిల్లలు ట్రాక్ ఆడుకుంటున్నారని…ఇంతలో సడెన్ గా వచ్చిన రైలు వారిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలిచారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు చిన్నారులు మరణించిగా…మరో చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఒక చేయి తీసేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటట సట్లెజ్ నదికి దగ్గర జరిగింది. సహరాన్ పూర్ నుంచి ఉనా హిమాచల్ కు వెళ్తున్న రైలు ఈ చిన్నారులను ఢీ కొట్టింది. సట్లెజ్ నది తీరాన బెర్రీల కోసం చిన్నారులు వెళ్లారు. చెట్ల మధ్య తిరుగుతూ…సడెన్ గా పట్టాలపైకి వచ్చారు. అయితే రైలు వస్తున్న విషయాన్ని చిన్నారులు గమనించలేదు. దీంతో వారిని రైలు ఢీకొట్టింది. చిన్నారుల మరణంతో వారి కుటుంబాలు దారుణంగా విలపిస్తున్నాయి.

 

ప్రమాదంపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఆర్థికసాయం అందేలా చూస్తానని హామీఇచ్చారు.