Congratulations Warangal: గ్లోబల్ నెట్‌వర్క్‌లో ‘వరంగల్‌’కు చోటు!

తెలంగాణ అంటేనే చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. వరంగల్, గోల్కొండ, భువనగిరి, దేవరకొండ లాంటి కోటలు నేటికీ ఆకట్టుకుంటాయి.

  • Written By:
  • Updated On - September 6, 2022 / 01:05 PM IST

తెలంగాణ అంటేనే చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, గోల్కొండ కోట, భువనగిరి బురుజు, దేవరకొండ ఖిల్లా లాంటి కోటలు నేటికీ ఆకట్టుకుంటాయి. ఈ కోటలు తెలంగాణ శిల్పా కళా వైభవానికి గుర్తులు. ఇప్పటికే తెలంగాణలో భాగమైన రామప్ప టెంపుల్ కు యూనెస్కో గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణకు మరో గుర్తింపు దక్కింది.

వరంగల్ కు గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో చోటు లభించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సుసంపన్న భారతీయ వారసత్వాన్ని చాటిచెప్పి, ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు. Narendramodi చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు నిదర్శనమన్నారు. గ్లోబల్ నెట్‌వర్క్‌లో వరంగల్‌కు చోటు తెలంగాణకు గర్వకారణమన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం హోదా లభించిన ఏడాదిలోపే, వరంగల్ కు గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో చోటు లభించడం విశేషం.