Site icon HashtagU Telugu

Karnataka: నా భార్య రోజూ కొడుతుందంటూ ఓ వ్యక్తి ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు..!!

Pmo

Pmo

కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి తనకు రక్షణ కల్పించాలంటూ ప్రధానమంత్రి (పీఎంఓ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన భార్య తనను రోజూ కొడుతుందని చంపేస్తానని బెదిరిస్తోందని ఆ వ్యక్తి ఆరోపించాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య సోషల్ మీడియా ద్వారా పీఎంఓకు ఫిర్యాదు చేశారు. పీఎంఓ తోపాటు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డి, కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ హ్యాండిలో ను ట్యాగ్ చేశాడు.

నాకు సాయం చేయండి..? గృహ హింస విషయంలో ఎవరైనా నాకు సహాయం చేశారా? ఎందుకంటే నేను కూడా మనిషిని..! నా భార్యా నాపై కత్తితో దాడి చేసింది. మీరు ప్రచారం చేసే స్త్రీ శక్తి ఇదేనా.? దీని కోసం నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అని ట్వీట్ చేశాడు. తన భార్య కత్తితో దాడి చేయడంతో చేతికి తీవ్రగాయమై రక్తస్రావం అయ్యిందని ఫొటోను జోడించాడు.

ఈ ట్వీట్‌పై బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి స్పందిస్తూ, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అతని ఫిర్యాదుకు పరిష్కరించాలని కోరాు. యదునందన్ ఆచార్యకు అన్ని వర్గాల మద్దతు లభించిందని, వేధింపులకు గురైన భర్తల సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని కమిషనర్ ఎత్తిచూపారు.

Exit mobile version