Break Up Leaves : ఉద్యోగులకు బ్రేకప్ లీవ్స్.. సంచలన నిర్ణయంపైనే అంతటా చర్చ

Break Up Leaves : ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే లీవ్స్ ఎన్నో రకాలు. జ్వరం వచ్చినప్పుడు సిక్ లీవ్స్ ఇస్తారు.

Published By: HashtagU Telugu Desk
Relationship 9 Reasons To Break Up With Someone

Relationship 9 Reasons To Break Up With Someone

Break Up Leaves : ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే లీవ్స్ ఎన్నో రకాలు. జ్వరం వచ్చినప్పుడు సిక్ లీవ్స్ ఇస్తారు. ప్రతినెలా కంపెనీ ఇచ్చే ఒక లీవ్‌ను క్యాజువల్ లీవ్స్ అంటారు. గర్భిణులైన మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్స్ ఇస్తుంటారు. కానీ ఓ కంపెనీ యువ ఉద్యోగుల కోసం వెరైటీ లీవ్స్‌ను ప్రవేశపెట్టింది. ప్రేమలో భగ్నమయ్యే యువతకు రెస్ట్ ఇచ్చేందుకు బ్రేకప్ లీవ్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ పేరు.. ‘స్టాక్‌ గ్రో’. ఇది ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ.

We’re now on WhatsApp. Click to Join

లవ్ బ్రేకప్ జరగడంతో గుండె చెదిరిపోయిన భగ్న ప్రేమికులకు అండగా నిలిచేందుకు స్టాక్‌ గ్రో కంపెనీ బ్రేకప్ లీవ్స్‌ను ప్రవేశపెట్టింది. బ్రేకప్ అయ్యాక.. రిలాక్స్‌డ్‌గా టైం గడిపేందుకు, మనసును బలంగా చేసుకునేందుకు ఈ లీవ్ దోహదం చేస్తుందని ఆ కంపెనీ హెచ్ఆర్ విభాగం వారు చెబుతున్నారు. తద్వారా ఉద్యోగి పూర్తిస్థాయి విశ్వాసం, బలంతో తిరిగి ఉద్యోగంలోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కొందరు ఉద్యోగులు బ్రేకప్ వల్ల పడిన మనో వేదనను పరిగణనలోకి తీసుకొని.. బ్రేకప్ లీవ్స్ పాలసీని తమ హెచ్ఆర్ విధానంలో జోడించామని చెప్పారు.

Also Read :Phone Tapping Den : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌజ్ నుంచే ‘ఫోన్ ట్యాపింగ్’ !?

ఈ విధానం ప్రకారం స్టాక్‌ గ్రో ఉద్యోగులలో ఎవరికైనా లవ్ బ్రేకప్(Break Up Leaves) జరిగితే.. కనీసం వారం రోజుల పాటు పెయిడ్ హాలిడేస్ తీసుకోవచ్చు. లవ్ బ్రేకప్ అనే కారణంతో లీవ్ పెడితే.. ఇక వివరణ అడగబోమని, రుజువులు చూపించాల్సిన అవసరం కూడా లేదని స్టాక్‌ గ్రో కంపెనీ హెచ్‌ఆర్ విభాగం అంటోంది.  ఈ సెలవును ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మేనేజ్‌మెంట్‌తో నేరుగా సంప్రదించొచ్చు. ఉద్యోగులకు ఈ లీవ్ మనశ్శాంతిని ఇస్తుందని, వారు తిరిగి వచ్చి మెరుగైన పని చేస్తారని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల బ్రేకప్ గురించి కూడా ఇంతగా ఆలోచించే కంపెనీ ఉంటుందా అనే అంతటా చర్చ జరుగుతోంది. లవ్ చేసి భంగపడ్డ వాళ్లకు భరోసా ఇవ్వడం గొప్ప విషయమని ఇంకొందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Also Read : MLC Ticket : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు.. సీపీఐ పార్టీకా? కాంగ్రెస్ అభ్యర్థికా ?

  Last Updated: 08 Apr 2024, 12:29 PM IST