Site icon HashtagU Telugu

MP : ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేకపోవడంతో మనస్తాపం చెంది…17ఏళ్ల బాలిక సూసైడ్..!!

Sucide Imresizer

Sucide Imresizer

మధ్యప్రదేవ్ లోని ఇండోర్ లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంగ్లీష్ లో అనర్గళం మాట్లాడలేపోతున్నాని మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది. న్యూ గౌరీనగర్ కాలనీలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…శైల కుమారి అనే 17ఏళ్ల బాలిక తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నానంటూ ..ఇంగ్లీష్ ట్యూషన్ కూడా తీసుకునేది. ఆ అమ్మాయి స్నేహితులు అనర్గళం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని…తనకు రావడంతో డిప్రెషన్ కు గురైందని బాలిక కుటుంబం తెలిపింది. అందుకే డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటన హాపూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో జరిగింది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానస్పది స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఆ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయంపై స్పష్టత లేనట్లు పోలీసులు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.