Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

చాలామంది చిన్న వయసులోనే ఉద్యోగం చేయడానికి డబ్బులు సంపాదించడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 09:30 AM IST

చాలామంది చిన్న వయసులోనే ఉద్యోగం చేయడానికి డబ్బులు సంపాదించడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది మాత్రం లైఫ్ ను ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఉద్యోగాలు చేసిన తర్వాత 60 ఏళ్ళు దాటింది అంటే రిటైర్మెంట్ కి మొగ్గు చూపే వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. అయితే ఇన్నేళ్లపాటు కష్టపడ్డాము కనీసం ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుందాము అన్న ఆలోచనతో చాలామంది రిటైర్మెంట్ ను తీసుకుంటూ ఉంటారు. కానీ అమెరికాలో మసాచు సెట్స్ కు చెందిన ఒక మహిళ మాత్రం 21 వయసులోనే ఉద్యోగంలో చేరి 86 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉంది.

అది కూడా ఎయిర్ హోస్ట్ గా జాబు చేస్తోందట. అంతేకాకుండా ఆమె ఒకే సంస్థలో దాదాపుగా 65 ఏళ్లుగా పనిచేస్తూనే ఉందట. ఆమె పేరు బెట్టి నాష్. ఈ ఘనతతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును కూడా సాధించింది. మామూలుగా చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు ఐదు నుంచి ఆరేళ్ల ఒక కంపెనీలో పని చేసి ఆ తర్వాత మళ్లీ వేరే కంపెనీలకు వెళుతూ ఉంటారు. కొందరు మాత్రం ఓపికతో 10,20 ఏళ్ల పాటు కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థల్లో దాదాపుగా 65 ఏళ్లుగా ఒకే రూట్లో సేవలు అందిస్తోందట.

ఆమె 1957లో అమెరికన్ ఎయిర్ లైన్స్ లో తొలిసారి ఎయిర్ హోస్టుల కెరీర్ ను మొదలుపెట్టి ఇన్నేళ్లుగా న్యూయార్క్ వాషింగ్టన్ మధ్య విధులు నిర్వహిస్తూనే ఉందట. ఆమె ప్రయాణికుల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారని, తరచూ ఆ మార్గంలో ప్రయాణించే చాలామంది ఆమెకు ఫ్యాన్స్ గా కూడా మారిపోయారని తెలిపారు. అయితే ఆమె అలా ఒకే రూట్లో పని చేయడానికి ఒక కారణం కూడా ఉందట. ఆమె కొడుకు అంగవైకల్యంతో బాధపడుతుండడంతో, అతడికి తల్లి సేవలు చాలా అవసరమట. అయితే ఆమె న్యూయార్క్ అలాగే వాషింగ్టన్ రూటులో పనిచేస్తే రాత్రికల్లా ఇంటికి వచ్చేసి తన కుమారుని చూసుకోవచ్చని ఆమె భావించింది. దీంతో ఎయిర్లైన్స్ అధికారులు కూడా ఆమె మంచితనానికి విద్య నిర్వహణలో నిబద్దతకు మించి అలా కొనసాగించేందుకు అంగీకరించారట. ఈ క్రమంలోనే ఆ రూట్ లో ఎంతో మంది పైలెట్లు,సిబ్బంది,అధికారులు మారినప్పటికీ ఆమె మాత్రం అలాగే ఎయిర్ హోస్ట్ గా కొనసాగుతూనే వస్తోందట.