Site icon HashtagU Telugu

Variety Fines : చూయింగ్ గమ్ తింటే 60 లక్షల ఫైన్.. సిగరెట్ ముక్క రోడ్డుపై పడేస్తే 3 లక్షల ఫైన్

Variety Fines

Variety Fines

Variety Fines : కొన్ని ట్యాక్స్ లు వెరైటీగా ఉంటాయి..

వినగానే ఆశ్చర్యపోయి ముక్కున వేలు వేసుకునేంత విచిత్రాతి విచిత్ర ట్యాక్స్ లు కూడా ఉంటాయి.

అలాంటి వెరైటీ ఫైన్స్..  వెరైటీ ట్యాక్స్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

చూయింగ్ గమ్ తింటే 60 లక్షలు ఫైన్ 

చూయింగ్ గమ్ అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు  దర్జాగా చూయింగ్ గమ్ నమిలే వాళ్ళను మనం చూస్తుంటాం. కానీ సింగపూర్ లో ఆ స్వేచ్ఛ లేదు.. అక్కడ చూయింగ్ గమ్ తింటూ దొరికిపోతే 60 లక్షల రూపాయలు ఫైన్ (Variety Fines) వేస్తారు.  2 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తారు. 2021 నుంచి  సింగపూర్ లో  ఈ  విచిత్రమైన ఫైన్ ను విధిస్తున్నారు. దేశంలోని రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగపూర్ సర్కారు అప్పట్లో  ప్రకటించింది. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన రోడ్లను అభివృద్ధికి కొలమానాలుగా అభివర్ణించింది.

రోడ్డుపై సిగరెట్ విసిరితే 3 లక్షలు ఫైన్ 

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో సిగరెట్ తాగి.. దాని ముక్కను గనుక రోడ్డుపై పడేస్తే 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. ఏదైనా  కంపెనీలో పనిచేసే ఉద్యోగి డ్యూటీ లో ఉండగా  సిగరెట్ తాగి రోడ్డుపై పడేస్తే.. ఆ కంపెనీకి  ఎనిమిదిన్నర లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. ఆస్ట్రేలియాలో చెత్త వేయడానికి సంబంధించి కూడా చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

భిక్షాటన చేస్తే జరిమానా

ఇటలీ దేశంలోని రోమ్, మిలన్‌ సహా  అనేక నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో నిద్రపోవడం, భిక్షాటన చేయడంపై  జరిమానాలు విధిస్తారు. ఈ నిబంధనపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ చట్టం నిరాశ్రయులైన ప్రజల సమస్యను పరిష్కరించడానికి బదులు.. వారి జీవితాలను ఇబ్బంది పెట్టేలా ఉందనే విమర్శలు ఉన్నాయి.

Also read ” Bihar: ఇదేందయ్యా ఇది.. టూ వీలర్ పై సీటు బెల్ట్ పెట్టుకోలేదని రూ. 1000 జరిమానా?

టీవీ చూడటానికి లైసెన్స్.. తీసుకోకుంటే  91 లక్షలు ఫైన్ 

స్విట్జర్లాండ్‌లో టీవీని కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఏటా టీవీ-రేడియో లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది. స్విస్ నేషనల్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ‘SRG SSR’ నుంచి ప్రసారమయ్యే రేడియో లేదా టెలివిజన్ ప్రోగ్రామ్‌ సిగ్నల్స్ ను  స్వీకరించే ఏ వినియోగదారుడు అయినా ఈ లైసెన్స్ ఫీజును  తప్పకుండా చెల్లించాలి. ఎవరైనా ఇది చెల్లించడంలో విఫలమైతే..  అతడిపై జరిమానా విధిస్తారు. ఇంట్లో టీవీ, రేడియో ఉంచుకున్నందుకు వార్షిక రుసుముగా రూ.30,000 కట్టాలి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే రెట్టింపు ఫీజు కట్టాలి. ఒకవేళ ఈ  లైసెన్స్ ఫీజును  చెల్లించకుంటే రూ.91 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

రోడ్డుపై ప్రేమను చూపిస్తే ఫైన్

యుఏఈలోని అత్యంత ప్రసిద్ధ నగరమైన దుబాయ్‌లో కఠినమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా లేదా అగౌరవంగా ప్రవర్తిస్తే జరిమానాలు విధిస్తారు. బహిరంగంగా స్త్రీ, పురుషులు ఒకరిపై ఒకరు ఆప్యాయత చూపిస్తే.. మహిళలు చిన్న దుస్తులు ధరించి తిరిగితే భారీ జరిమానాలు విధిస్తారు.

దోసకాయ సలాడ్ పై 57,000 జరిమానా

చైనాలోని షాంఘైలో ఈ నెలలోనే  ఒక రెస్టారెంట్ యజమాని లైసెన్స్ లేకుండా దోసకాయ సలాడ్ ను అమ్మాడు. దీంతో అతడిపై రూ. 57,000 జరిమానా విధించారు. ఈ వార్త చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్  Weiboలో వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే ఈ  పోస్ట్‌ను 9.5 మిలియన్ల మంది వీక్షించారు. ఇలా ఫైన్ వేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం మీకు జరిమానా విధించాలనుకుంటే, ఆహారంలో వెనిగర్ చల్లడం కూడా చట్టవిరుద్ధమే ‘  అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.