Site icon HashtagU Telugu

AC : ఏసీ కొనుగోలు చేయబోతున్నారా..? ఇలా తీసుకుంటే మీకు కరెంట్ బిల్లు ఆదా !

Ac 5star

Ac 5star

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు (Sun Temperature) దంచికొడుతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు మండుతున్న వేడికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ ప్రభావంతో చాలామంది వడదెబ్బ, నీరసం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వేడిని తట్టుకోవడానికి ప్రజలు ఏసీలు (AC), కూలర్లు వంటి వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో మార్కెట్లో ఏసీ, కూలర్ల కొనుగోలుకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, ఏసీ కొనడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.

Spirtual: ఏంటి మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే సమస్యల కారణమా?

5 స్టార్ రేటింగ్ (5 Star Rating) ఉన్న ఏసీలను కొనుగోలు చేస్తే మీకు కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) ప్రకారం, 5 స్టార్ రేటెడ్ ఏసీలు వాడితే 60% వరకు విద్యుత్ ఆదా అవుతుంది. ఇది విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, శక్తి వనరులను కూడా పరిరక్షించడంలో సహాయపడుతుంది. దేశంలో ప్రస్తుతం వాడుతున్న ఏసీలలో చాలా వరకు 8 ఏళ్లకుపైగా పాతవే ఉన్నాయి. ఈ పాత ఏసీలు కొత్త వాటితో పోలిస్తే 40-50% ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. అందువల్ల పాత ఏసీలను మార్చి కొత్త 5 స్టార్ ఏసీలను వాడటం మంచిది.

ఏసీ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా ఎండ వేడిని తగ్గించుకోవచ్చు. 5 స్టార్ ఏసీలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించేందుకు సహాయపడతాయి. అలాగే ఏసీని 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచడం ఉత్తమమైనది. ఇది విద్యుత్ ఖర్చును తగ్గించడమే కాకుండా, శరీరానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ వేసవి కాలంలో ఏసీ కొనుగోలు చేసే ముందు దాని విద్యుత్ వినియోగ సామర్థ్యం, రేటింగ్ వంటి అంశాలను పరిశీలించి సరైన ఎంపిక చేసుకోవడం మంచిది.