Gold : బంగారం కొంటున్నారా, అయితే 14 క్యారట్ల బంగారం గురించి పూర్తిగా తెలుసుకోండి..!!

బంగారం అంటే ఇష్టపడని మగువలు ఉంటారా చెప్పండి. రకరకాల డిజైన్లతో బంగారు ఆభరణాలు చేయించుకుని వేసుకుంటారు. ఫంక్షన్ ఏదైనా సరే...మెడలో బంగారు నెక్లెస్ ఉండాల్సిందే.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 02:13 PM IST

బంగారం అంటే ఇష్టపడని మగువలు ఉంటారా చెప్పండి. రకరకాల డిజైన్లతో బంగారు ఆభరణాలు చేయించుకుని వేసుకుంటారు. ఫంక్షన్ ఏదైనా సరే…మెడలో బంగారు నెక్లెస్ ఉండాల్సిందే. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. గోల్డ్ స్మిత్ దగ్గరకు వెళ్లి డిజైన్లు చేయించుకునే కాలం పోయింది. అంతా ఆన్ లైన్లో దొరకుతున్నార. మంచి మంచి డిజైన్లు కనిపిస్తున్నాయి. అయితే 22క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం గురించి తెలుసు. కానీ 14, 18క్యారెట్ల బంగారు ఆభరణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 22 క్యారెట్లతో పోల్చితే చౌకగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా 18 క్యారెట్ల బంగారంతో పోల్చితే…22శాతం తక్కువగా…22 క్యారెట్లతో పోల్చితే 36శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో మరో ఆలోచన లేకుండా మహిళలు 14క్యారెట్లతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.

ఇక సాధారణంగా బంగారు ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం ను ఉపయోగిస్తుంటారు. అయితే తక్కువ ధరలో కొనుగోలు చేసుకునేవారికి కొంచెం తక్కువ క్యారెట్లతో చేసినవి కూడా లభిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది. వజ్రాుల, రత్నాలతో చేసే ఆభరణాలకు 18 క్యారెట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే 22 క్యారెట్లతో పోల్చితే 18 క్యారెట్లు మరింత గట్టిగా ఉండటంతోపాటు రాళ్లను ఆపుతాయి.

14 క్యారెట్ల బంగారంలో స్వచ్చమైన బంగారం 58.3శాతం ఉంటుంది. మిగతాది ఇతర లోహాలను కలుపుతారు. దాంతో 22 క్యారెట్లతో పోల్చితే…వీటిని మన్నిక ఎక్కువగా ఉంటుంది. ధర కూడా తక్కువగా ఉంటుంది. ఇక ఆకర్షణీయతోనూ ఏమాత్రం తీసిపోవు.

ఇక ధరలు చూసినట్లయితే…22 క్యారెట్ల తులం బంగారం ఆభరణాల ధర రూ. 48,690 ఉందనుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర రూ. 39,840, 14 క్యారెట్ల ధర రూ. 30, 980 గా ఉంటుంది. అయితే 22, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై రుణాలు కూడా లభిస్తాయి. కానీ 14 క్యారెట్ల ఆభరణాలపై ఎలాంటి రుణాలు లభించవు. కొనుగోలు చేసిన సంస్థల దగ్గర జీవిత కాలం వాటిని ఎక్సేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆభరణాలను జ్యుయలర్ కు తిరిగి విక్రయిస్తే బంగారం 3శాతం తరుగు కింద చూపిస్తారు. డైమండ్, జెమ్ స్టోన్స్ తో చేసిన ఆభరణాలు అయితే తరుగు 10 నుంచి 30శాతం మధ్య ఉంటుంది.

ఇక ఈ 14 క్యారెట్ల బంగారు ఆభరణాలు టాటా తనిష్క్, కల్యాణ్ జ్యుయలర్స్, క్యాండియర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇలా ఎన్నో వేదికలపై లభిస్తాయి. కాకపోతే రిటర్న్ పాలసీ, నియమ నిబంధనలు చదివిన తర్వాతే కొనుగోలు చేయడం మంచిది.