Dog Missing: తప్పిపోయిన కుక్క.. పట్టిస్తే 25 వేల బహుమతి

చమేలీ అనే 13 ఏళ్ల కుక్క గత నెలలో కనిపించకుండా పోయింది. కుక్క అచూకీ కోసం ఢిల్లీకి చెందిన యజమానులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
animals

animals

చమేలీ అనే 13 ఏళ్ల కుక్క గత నెలలో కనిపించకుండా పోయింది. కుక్క అచూకీ కోసం ఢిల్లీకి చెందిన యజమానులు తీవ్రంగా గాలిస్తున్నారు. కుక్క అడ్రస్ దొర్కపోవడంతో చివరకూ రివార్డ్ ను కూడా ప్రకటించారు. కుక్కను పట్టిస్తే 25,000 రూపాయల బహుమతిని ఇస్తామని తెలిపారు. దీపావళి రోజు రాత్రి, అక్టోబర్ 24న బాణాసంచా కాల్చడం వల్ల కుక్క భయపడి ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌ ఏరియాలో తప్పిపోయింది.

‘‘వయసు 13, తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియదు. మేము పూర్తిగా నిరాశతో ఉన్నాం. చమేలీ అచూకి కోసం సహాయం కావాలి ”అని యజమాని అనుప్రియా దాల్మియా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె జన్యు శాస్త్రవేత్త. 14 సంవత్సరాల వయస్సు నుండి కుక్కతో కలిసి ఉంటుందామె. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

  Last Updated: 26 Nov 2022, 02:55 PM IST