Site icon HashtagU Telugu

French Fries : ఒక ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రై @15000.. గిన్నిస్ బుక్ లో చోటు

French Fries

French Fries

ఫ్రెంచ్ ఫ్రై రుచి అంతా ఇంతా కాదు!! అయితే అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న సెరెండిపిటి రెస్టారెంట్ లో దొరికే ఫ్రెంచ్ ఫ్రై రేటే సెప”రేటు”!! అక్కడ ఒక ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రై ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా రూ.15,800 చెల్లిస్తే కానీ ఆ రెస్టారెంట్ లో ఫ్రెంచ్ ఫ్రై తినే భాగ్యం మనకు దొరకదు. దాదాపు బంగారం రేటు కలిగిన ఈ వంటకం ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ వంటకం పూర్తి పేరు ‘Crème dela Crème Pommes Frites’. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆలుగడ్డలతో ఈ ఫ్రెంచ్ ఫ్రై వండుతారు. అంతేకాదు.. వింటేజ్ 2006 షాంపెన్, జో లీ బ్లాక్ ఫ్రెంచ్ షాంపెన్ వినెగర్, ట్రాఫుల్ సాల్ట్, ట్రాఫుల్ ఆయిల్, బటర్,23 క్యారెట్ ఎడిబుల్ గోల్డ్ ఈస్టింగ్ కూడా ఇక్కడి ఫ్రెంచ్ ఫ్రై తయారీలో వాడుతారు. వీటన్నింటి సమాహారంగా వండిన తర్వాత వెరీ వెరీ టేస్టీ.. వెరీ వెరీ కాస్ట్ లీ ఫ్రెంచ్ ఫ్రై తయారవుతుంది. జులై 13న అమెరికా నేషనల్ ఫ్రెంచ్ ఫ్రై డే సందర్భంగా సెరెండిపిటి రెస్టారెంట్ లో ఈ కాస్ట్ లీ ఫ్రెంచ్ ఫ్రై తయారు చేశారు. దీన్ని తినాలని ఆలోచించినా మీ జేబు ఖాళీ అవడం ఖాయం.మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ లీ డెజర్ట్ కూడా ఇదే రెస్టారెంట్ లో లభిస్తుంది. దాని రేటు ఇంకా ఎక్కువ. 19 లక్షలు.. ఒక ప్లేట్ డెజర్ట్.