Thalapathi Vijay Leo Review & Rating రివ్యూ : లియో

Thalapathi Vijay Leo Review & Rating దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా లియో. ఖైదీ, విక్రం సినిమాలతో లోకేష్

Published By: HashtagU Telugu Desk
Thalapathi Vijay Leo Review & Rating

Thalapathi Vijay Leo Review & Rating

నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మేనన్, మిస్కి న్, ప్రియా ఆనంద్, బాబూ ఆం టోనీ, మనోబాల, తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస

నిర్మా త : ఎస్.ఎస్.లలిత్ కుమార్, జగదీష్ పళణిస్వామి

రచన – దర్శకత్వం : లోకేష్ కనగరాజ్

Thalapathi Vijay Leo Review & Rating దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా లియో. ఖైదీ, విక్రం సినిమాలతో లోకేష్ యూనివర్స్ అంటూ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో లోకేష్ విజయ్ తో చేసిన లియో మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లియో సినిమాలో త్రిష ఫీమేల్ లీడ్ గా నటించగా సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతం మీనన్ లాంటి వారు నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

హిమాచ ప్రదేశ్ థియోగ్ లో కాఫీ షాప్ నడుపుకుంటూ తన భార్య పిల్లలను చూసుకుంటూ ఉంటాడు పార్తిబన్ (విజయ్). అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారి జోషి (గౌతం మీనన్) తో అతనికి మంచి స్నేహం ఉంటుంది. యానిమల్ రెస్క్యూ విషయంలో పార్తిబన్ అలర్ట్ గా ఉంటాడు. ఒకసారి ఊళ్లోకి హైనా వస్తే దాన్ని కాపాడతాడు. మరోపక్క కాఫీ షాప్ కి వచ్చిన దుండగులను అంతం చేస్తాడు. అలా పార్తిబన్ పేరు మారుమోగుతుంది. ఫోటోలు వార్తల్లో హైలెట్ అవుతాయి. అలా వైరల్ అయిన పార్తిబన్ ఫోటోలు ఆంటోని దాస్ (సంజయ్ దత్), హరోల్డ్ దాస్ కంట పడతాయి. పాతికేళ్ల క్రితం తమని కాదని వెళ్లిన లియో పోలికలతో పార్తిబన్ ఉండటం చూసి అతన్ని చంపాలని రెడీ అవుతారు. అసలు ఈ లియో ఎవరు..? ఆంటోని, హొరోల్డ్ దాస్ లు అతన్ని ఎందుకు చంపాలని అనుకుంటారు..? పార్తిబన్ ఎవరు..? లియో పార్తిబన్ ఒకరేనా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం – విశ్లేషణ :

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ టేకింగ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను చేసిన ఖైదీ, విక్రం సినిమాలు అతనికి బాగా క్రేజ్ తెచ్చాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా దళపతి విజయ్ తో లియో సినిమా చేశాడు లోకేష్. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే లోకేష్ మార్క్ కనిపించలేదన్న టాక్ వచ్చింది. సినిమా కూడా అదే విధంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీకి తగిన విధంగా అయితే లేదు.

లియో కొత్త కథ ఏమి కాదు. గతాన్ని విడిచి పెట్టి ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తున్న హీరో జీవితంలోకి మళ్లీ గతం వస్తే ఎలా ఉంటుంది అన్న కథతో లియో తెరకెక్కించారు. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ట్రైలర్ టైం లోనే ఈ సినిమా ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్, గాయం 2 సినిమాలను పోలినట్టు ఉందని అన్నారు. అందుకే లోకేష్ టైటిల్స్ లో ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ సినిమాకు క్రెడిట్ ఇచ్చాడు.

కథ పరంగా కొత్తగా లేకపోయినా లోకేష్ మార్క్ యాక్షన్ సీన్ అలరించాయి. విజయ్ ని కూడా చాలా స్టైలిష్ గా చూపించాడు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే ఖైదీ, విక్రం లతో పోల్చితే లియో అంత హై అనిపించదు. లియో సినిమాలో కథ కథనం కన్నా ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు లోకేష్. అయితే అది అంతగా వర్క్ అవుట్ అవలేదు.

సినిమాలో హైలెట్స్ గురించి చెబితే హైనా సీక్వెన్స్ అలరించాయి. పోలీస్ స్టేషన్ లో, కాఫీ షాప్ ఫైట్ బాగున్నాయి. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అనిరుధ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉందని అనిపించగా సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పాడు లోకేష్. ఖైదీ లోని నెపోలియన్ ను లియోకి తీసుకొచ్చ్ లింక్ కలిపాడు. అంతేకాదు లియోకి విక్రం అదే కమల్ హాసన్ కాల్ చేసి మాట్లాడటం తో నెక్స్ట్ సినిమా మీద హైప్ వచ్చేలా చేశాడు.

ఓవరాల్ గా చెప్పాలంటే ఖైదీ, విక్రం తరహాలో లియో ఆకట్టుకోలేదు కానీ విజయ్ ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమా ఉంది. LCUలో భాగంగా వచ్చిన లోకేష్ ఫ్యాన్స్ ని సినిమా మెప్పించలేదు.

నటీనటులు :

పార్తిబన్, లియో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ (Vijay) అదరగొట్టాడు. సినిమాలో స్టైలిష్ గా.. యాక్షన్ సీన్స్ లో కూడా వావ్ అనిపించారు. త్రిష పాత్ర నిడివి తక్కువే కానీ ఉన్నంతలో అందంగా కనిపించింది. సంజయ్ దత్, అర్జున్ పాత్రలను సరిగా డీల్ చేయలేదు లోకేష్. గౌతం మీనన్, ప్రియ మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం :

అనిరుద్ (Anirudh) మ్యూజిక్ పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో బాగుంది. లోకేష్ (Lokesh Kanakaraj) సినిమాకు అనిరుద్ స్పెషల్ మ్యూజిక్ ఇస్తున్నాడని మరోసారి ప్రూవ్ అయ్యింది. కెమెరా మెన్ పనితీరు బాగుంది. యాక్షన్ సీన్స్ బాగా కంపోజ్ చేశారు. కథ రొటీన్ గా ఉన్నా కథనంలో కూడా తన ఇదివరకు సినిమాల మార్క్ సెట్ చేయలేదు లోకేష్. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

బాటం లైన్ :

లియో.. ఓన్లీ ఫర్ విజయ్ ఫ్యాన్స్..!

  Last Updated: 19 Oct 2023, 03:39 PM IST