Prabhas Salaar Review : రివ్యూ : సలార్ 1 సీజ్ ఫైర్

Prabhas Salaar Review ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సలార్. రెండు భాగాలుగా వస్తున్న సలార్ మొదటి భాగం సలార్ 1 సీజ్ ఫైర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ప్రభాస్ తో పృధ్విరాజ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, శృతి హాసన్, ఈశ్వరి రావు తదితర నటీనటులు నటించారు.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 02:13 PM IST

Prabhas Salaar Review  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సలార్. రెండు భాగాలుగా వస్తున్న సలార్ మొదటి భాగం సలార్ 1 సీజ్ ఫైర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ప్రభాస్ తో పృధ్విరాజ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, శృతి హాసన్, ఈశ్వరి రావు తదితర నటీనటులు నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

రాజ మన్నార్ (జగపతి బాబు) స్థాపించిన ఖాన్సార్ సామ్రాజ్యం అధికార ఖుర్చీ కోసం అక్కడ ఉండే వారి కన్ను పడుతుంది. అయితే తన తర్వాత తన కొడుకు వరద రాజమన్నార్ (పృధ్విరాజ్ సుకుమారన్)ను దొరగా చూడాలనేది తన కోరిక. అయితే రాజ మన్నార్ సామ్రాజ్యాన్ని వదిలి వెళ్లి కొన్నాళ్లకు తిరిగి వచ్చేలోగా ఖాన్సార్ కథ మారిపోతుంది. కుర్చీ కోసం అందరు కలిసి వరద రాజమన్నార్ ని అంతం చేయాలని చూస్తారు. మిగతా దొరలంతా కూడా సొంత సైన్యం సిద్ధం చేసుకుంటారు. వరద రాజమన్నార్ తన సైన్యంగా తన స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు. దేవా మిగతా సైన్యాన్ని ఎలా ఎదిరించాడు..? ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవ ఏం చేశాడు..? అతనికి సలార్ అనే పేరు ఎంద్కు వచ్చింది..? దేవ ఎందుకు పాతికేళ్ల నుంచి ఊళ్లని మారుస్తూ ఉంటాడు. దేవా లైఫ్ లో ఆద్య (శృతి హాసన్) ఎవరు..? వీటన్నిటికీ సమాధానమే సినిమా కథ.

కథనం – విశ్లేషణ :

బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. కె.జి.ఎఫ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ ని అదే రేంజ్ లో తెరకెక్కించాడు. సలార్ లో ఖాన్సార్ అంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించారు. కె.జి.ఎఫ్ తో పోలిస్తే హీరోయిజం, ఎలివేషన్లు ఇందులో తక్కువే సలార్ లో ఎక్కువగా డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

అలాగని హీరోయిజం లేదని కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. అవే సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా ఎక్కడ తగ్గకుండా వెళ్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుంది. అయితే సెకండ్ హాఫ్ విషయంలో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.

ఫ్రెండ్ షిప్, రివెంజ్, అధికార కాంక్ష వీటి చుట్టే సినిమా నడుస్తుంది. చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథను మొదలు పెట్టిన డైరెక్టర్ కథను వెయ్యేళ్ల కింద చరిత్రతో ముడిపెడ్తాడు. అక్కడక్కడ హీరోయిజం టాప్ గేర్ లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. కోల్ మైన్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అయితే పాత్రల మధ్య ఎమోషన్ ఇంకాస్త వర్క్ అవుట్ అయితే బాగుంటుంది. సెకండ్ హాఫ్ మధ్యలో కాస్త ట్రాక్ తప్పినా పతాక సన్నివేశాల్లో సినిమా మళ్లీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. ఇక శౌర్యాంగ పర్వంగా సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు :

ప్రభాస్ కటౌట్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాగా వాడుకున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూశారు. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ కెరీర్ బెస్ట్ అనిపించారు. శృతి హాసన్ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయిన ఉన్నంతలో మెప్పించింది. పృధ్విరాజ్ సుకుమారన్ కూడా వరద రాజమన్నార్ పాత్రలో అలరించారు. ఈశ్వరీ రావు, జగపతి బాబు, బాబీ సిం హా, శ్రియా రెడ్డి, జాన్ విజయ్ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం :

టెక్నికల్ గా సినిమా అంతా బాగా నడిపించారు. ఖాన్సార్ ప్రపంచం అద్భుతంగా తీర్చిదిద్దరు. రవి బస్రూర్ మ్యూజిక్ అలరించింది. భువన్ గౌడ కెమెరా వర్క్ సినిమాకు బలంగా నిలిచింది. అంబరివ్ స్టంట్స్ ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక రెగ్యులర్ కథను పెద్ద స్కేల్ లో తెరకెక్కించారు. అయితే సెకండ్ హాఫ్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. అయినా కూడా ఫ్యాన్స్ కి సినిమా బాగా నచ్చేసింది. నిర్మాణ విలువలు ఎక్కడ కాంప్రైఅజ్ కాకుండా తెరకెక్కించారు.

బాటం లైన్ :

సలార్.. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్..!

Follow us