Site icon HashtagU Telugu

Hi Nanna Twitter Review:`హాయ్‌ నాన్న` మూవీ ట్విట్టర్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే..?

Hi Nanna Twitter Review

Compressjpeg.online 1280x720 Image

Hi Nanna Twitter Review: నాని దసరా లాంటి ఊరమాస్ మూవీ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా `హాయ్‌ నాన్న` (Hi Nanna Twitter Review) అనే చిత్రం చేశాడు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. శృతి హాసన్‌ గెస్ట్ రోల్‌ లో కనిపించనుంది. కొత్త డైరెక్టర్ శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మించారు. తండ్రి కూతుళ్ల బాండింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీ నేడు (గురువారం) విడుదలయ్యింది. ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఎలా ఉందనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

విరాజ్‌ (నాని) ఓ ఫొటోగ్రాఫర్‌. ఓ ఫేమస్‌ ఫొటోగ్రాఫర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు యశ్నతో (మృణాల్‌ ఠాకూర్‌) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ, యశ్నకు ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే నచ్చదు. అలాంటి యశ్న కూడా విరాజ్‌ ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పిల్లలు కనే విషయంలో ఇద్దరికీ గొడవ అవుతుంది. చివరకు విరాజ్‌ కోరిక మేరకు యశ్న పిల్లలు కనడానికి ఒప్పుకుంటుంది. వారిద్దరికీ మహి (బేబీ కియారా ఖన్నా) పుడుతుంది. ఆ పాపకు ఓ ప్రమాదకరమైన వ్యాధి ఉంటుంది. దీని కారణంగా యశ్న పాపను దగ్గరకు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి విరాజ్‌, యశ్నల మధ్య ఎలాంటి గొడవలకు దారి తీసింది? పాప కారణంగా ఈ ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నదే మిగితా కథ.

Also Read: Bandla Ganesh : రేవంత్ మీద బండ్ల గణేష్ సినిమా..?

అయితే ఈ సినిమా చూసిన కొందరు నాని అభిమానులు మూవీ చాలా బాగుందని, పాత కథ అయిన దర్శకుడు మూవీని బాగా తీశాడు అని మెచ్చుకుంటున్నారు. ఈ మూవీలో చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయని మరొక యూజర్ ట్వీట్ చేశాడు. మరి నాని, మృణాల్ జంటగా నటించిన ఈ మూవీ హిట్ అయిందో లేదో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join.

Exit mobile version