Rules Ranjan Review & Rating రివ్యూ : రూల్స్ రంజన్

Rules Ranjan Review & Rating యువ హీరోల్లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తన ప్రయత్నాలను మాత్రం ఆపకుండా చేస్తున్న కిరణ్

  • Written By:
  • Updated On - October 7, 2023 / 12:34 PM IST

నటీనటులు : కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి, మెహర్‌ చాహల్‌, వెన్నెల కిషోర్‌, హైపర్‌ ఆది, వైవా హర్ష, సుదర్శన్, సుబ్బరాజు తదితరులు

సంగీతం : అమ్రిష్‌

సినిమాటోగ్రఫీ : దులిప్‌ కుమార్‌ ఎం.ఎస్‌

నిర్మాత : దివ్యాంగ్‌ లావనియా, మురళీకృష్ణ వేమూరి

దర్శకత్వం : రత్నం కృష్ణ

Rules Ranjan Review & Rating యువ హీరోల్లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తన ప్రయత్నాలను మాత్రం ఆపకుండా చేస్తున్న కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూల్స్ రంజన్. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

తిరుపతిలో మిడిల్ క్లాస్ కుర్రాడైన మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) స్టడీస్ లో యావరేజ్ స్టూడెంట్ అయినా కష్టపడి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ తెచ్చుకుంటాడు. జాబ్ కోసం ముంబై మకాం మార్చేస్తాడు. హిందీ రాకపోయినా ఎలాగోలా మ్యానేజ్ చేసి టీం లీడర్ స్థాయికి ఎదుగుతాడు. తన ఆఫీస్ లో అంతా తన రూల్స్ ప్రకారం ఫాలో అయ్యేలా చేస్తాడు రంజన్. అందుకే వాళ్లంతా రూల్స్ రంజన్ అని అతన్ని పిలుస్తారు. అలా వెళ్తున్న అతని లైఫ్ లోకి కాలేజ్ డేస్ లో ప్రేమించిన సనా (నేహా శెట్టి) కనిపిస్తుంది. అప్పుడు భయంతో ఆమె మెద ప్రేమను చెప్పని రంజన్ ముంబైలో ఆమెను చూశాక ఆమెకు తన ఇష్టాన్ని చెబుతాడు. సనా కూడా రంజన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత ఆమె అతనికి దూరం అవుతుంది. సనాని వెతుక్కుంటూ తిరుపతికి వెళ్తాడుయ్ రంజన్. ఇంతకీ సనా ఎందుకు రంజన్ కి దూరమైంది..? ఆమెను దక్కించుకునేందుకు రంజన్ చేసిన ప్లాన్స్ ఏంటి..? ఈ ప్రాసెస్ లో అతనికి ఎదురైన సమస్యలు ఏంటైన్నది ఈ సినిమా కథ.

కథనం – విశ్లేషణ :

రూల్స్ రంజన్ ప్రచార చిత్రాలు పర్వాలేదు అనిపించగా సినిమా చూస్తే ఇది రొటీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే అనిపిస్తుంది. కథ.. కథనాల్లో ఎలాంటి కొత్తదనం ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో అలా వెళ్తుంది తప్ప అందులో పెద్దగా మ్యాటర్ ఉన్నట్టు అనిపించదు. సెకండ్ హాఫ్ కొద్దోగొప్ప బెటర్ అన్నట్టుగా ఉన్నా అది కూడా సరిగా నడిపించలేదు.

సినిమా మొదైనప్పటి నుంచి రూల్స్ రంజన్ కథా నేపథ్యం పరిచయం మొదలైనా అవేవి ఆడియన్ ని మెప్పించేలా ఉండవు. ముంబైలో ఆఫీస్ లో హిందీ రాక ఇబ్బంది పడే సీన్స్ కామెడీ అనుకున్నారేమో కానీ అదంతా కూడా డల్ గానే అనిపిస్తాయి. వెన్నెల కిశోర్ వచ్చినప్పటి నుంచి సినిమా కాస్త వేగం పుంజుకుంటుంది. రంజన్ తో అతని సీన్స్ కావాలని పెట్టినట్టు ఉన్నా కాస్త ఎంటర్టైన్ చేస్తాయి.

ఇక రూల్స్ రంజన్ కథకు బలమైన ఎమోషన్ అతని లవ్ స్టోరీ. కానీ కాలేజ్ డేస్ లో సింపుల్ పాటతో పరిచయం చేసి ఎలాంటి ఫీల్ లేకుండా చేశారు. రంజన్ సనా మధ్య సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ అంతా ఇలా నడవగా సెకండ్ హాఫ్ తిరుపతికి షిఫ్ట్ అవుతుంది.

సనాని దక్కించుకోవాలనే ప్రయత్నంలో రంజన్ వాళ్లని విడగొట్టే ప్రయత్నంలో ఆది, హర్ష ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. సుబ్బరాజు ఆది గ్యాంగ్ చేసిన బార్ ఎపిసోడ్ కాస్త ఎంటర్టైన్ చేస్తుంది. రంజన్ సనాల ప్రేమకథ లో సరైన ఫీల్ లేదు. వారి మధ్య ఎమోషన్ వర్క్ అవుట్ కాలేదు. సినిమా అంతా లాజిక్ లెస్ గా సాగినా రూల్స్ రంజన్ కాస్త నవ్వులు తప్ప సినిమాలో పెద్దగా మ్యాటర్ ఏం లేదు.

నటీనటులు :

కిరణ్ అబ్బవరం రంజన్ పాత్రలో మెప్పించాడు. అయితే అతని క్యారెక్టర్ ని సరిగా డిజైన్ చేయలేదు దర్శకుడు. నేహా శెట్టి కూడా తన పాత్ర వరకు బాగానే చేసింది. వెన్నెల కిశోర్, హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష, సుబ్బరజు ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేశారు. మిగతా వారంతా కూడా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం :

రూల్స్ రంజన్ సినిమాకు అమిరీష్ మ్యూజిక్ అందించారు. ఒక్కటి రెండు సాంగ్స్ బాగున్నాయి, బిజిఎం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఓకే అనేలా ఉంది. దర్శకుడు రత్నం కృష్ణ అవుట్ డేటెడ్ రొటీన్ కథ కథనంతో వచ్చారు. కథ పాతదే అయినా కొత్తగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

బాటం లైన్ :

రూల్స్ రంజన్.. గాడి తప్పేశాడు..!

రేటింగ్ : 2/5

Also Read : Ashu Reddy : బీచ్‌లో హాట్ హాట్ భంగిమలతో రెచ్చిపోయిన అషు రెడ్డి..

We’re now on WhatsApp. Click to Join