Keeda Cola Review & Rating : కీడా కోలా : రివ్యూ

Keeda Cola Review & Rating ఈ తరం దర్శకుల్లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది

Published By: HashtagU Telugu Desk
Keeda Cola Review & Rating

Keeda Cola Review & Rating

నటీనటులు : చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్క ర్, జీవన్ కుమార్, విష్ణు, రవీంద్ర విజయ్

సంగీతం : వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ : ఏజే అరోన్

నిర్మాత : కె.వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నం దరాజ్, ఉపేం ద్ర వర్మ

సమర్పణ : రానా దగ్గుబాటి

రచన-దర్శకత్వం : తరుణ్ భాస్కర్

Keeda Cola Review & Rating ఈ తరం దర్శకుల్లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన థర్డ్ మూవీ కీడ కోలా. ప్రేక్షకుల్లో సూపర్ బజ్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

We’re now on WhatsApp : Click to Join

కథ :

వాస్తు (చైతన్య రావు) అతని తాత వరదరాజు (బ్రహ్మానందం) లాయర్ కౌశిక్ (రాగ్ మయూర్) వీళ్లందరు డబ్బు సంపాధించడమే తమ లక్ష్యంగా పెట్టుకుంటారు. తాత కోసం కొన్ని కూల్ డ్రింక్స్ లో బొద్దింకని చూపించి ఓనర్ ని బ్లాక్ మెయిన్ చేయాలని ప్లాన్ చేస్తారు. అలా వారి మధ్య బేరసారాలు జరుగుతుంటాయి. ఇక ఓ పక్క కార్పొరేటర్ కావాలని కలలు కంటున్న జీవన్ 20 ఏళ్లు జైల్లో ఉండి బయటకు వచ్చిన తన నాయుడు (తరుణ్ భాస్కర్) అండతో గట్టి ప్రయత్నాలు చేస్తాడు. జీవన్ కి కూడా కార్పొరేటర్ అయ్యేందుకు డబ్బు అవసరం అవుతుంది. అందుకే వీళ్లంగా కూడా డబ్బు కోసం ప్లాన్ చేస్తుంటారు. వీరి ప్రయత్నాలు ఫలించాయా.. డబ్బు సంపాధించాలని వీళ్లంతా ఏం చేశారు..? వాస్తు గ్యాంగ్, జీవన్ గ్యాంగ్ మధ్య రిలేషన్ ఎలా కుదిరింది. కోలాలో బొద్దింక ఎలా పడింది..? ఈ విషయాలన్నీ తెలియాలంటే కీడా కోలా చూడాల్సిందే.

కథనం – విశ్లేషణ :

క్రైం కామెడీ జోనర్ సినిమా అంటే ఆడియన్స్ అంతా కూడా ఓ పక్క థ్రిల్ మూడ్ ని కొనసాగిస్తూనే వాళ్లు ఎంటర్టైన్ అవుతూ ఉండాలి. అయితే ఇప్పటివరకు చాలా సెన్సిటివ్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టిన తరుణ్ భాస్కర్ మొదటిసారి క్రైం స్టోరీతో వచ్చాడు. అయితే అతను రాసుకున్న పాత్రలు వారి మధ్య సన్నివేశాలు, సంభాషణలు ఇవన్నీ ఆడియన్స్ ని అలరిస్తాయి.

తరుణ్ భాస్కర్ ఇదివరకు సినిమాలకు ఈ సినిమాకు అస్సలు పోలిక ఉండదు. మొదటి రెండు సినిమాల్లో సహజత్వానికి ఎక్కువ స్కోప్ ఇచ్చిన తరుణ్ కీడా కోలా లో లాజిక్ కి భిన్నంగా నవ్వించడమే టార్గెట్ అన్నట్టుగా చేశాడు. కథ కథనాలు అతను సినిమా నడిపించిన తీరులో అతని మార్క్ కనిపిస్తుంది. అన్ని యాస్పెక్ట్స్ లో నవ్వించే ప్రయత్నం చేశాడు తరుణ్ భాస్కర్.

వాస్తు తాత లాయర్ కోణం నుంచి మొదలు పెట్టి జీవన్ కార్పొరేట్ కల అంటూ కథ నడిపించాడు. ఇక నాయుడు ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరిగింది. శ్వాస మీద ధ్యాస, రోజుక్లో గంట ఇంగ్లీష్ అంటూ తరుణ్ భాస్కర్ వన్ లైనర్స్ సరదా సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్ చేస్తాయి.

ఇక సెకండ్ హాఫ్ కూడా సరదాగానే మొదలు పెడతాడు. కీడా కోలా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ గెటప్ శ్రీను సందడి చేస్తాడు. బ్రహ్మి పాత్రను వీక్ చెయిర్ కే పరిమితం చేసినా ఆయన నుంచి హాస్యాన్ని పండించాడు తౌణ్ భాస్కర్. కొన్ని సన్నివేశాలు ఊహకు తగినట్టుగానే సాగుతున్నట్టు అనిపిస్తున్నా ప్రేక్షకులను నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. తరుణ్ భాస్కర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి కీడా కోలా ఫన్ రైడ్ గా ఎంటర్టైన్ చేస్తుంది.

నటీనటులు :

తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాదు నటుడిగా కూడా అదరగొట్టాడు. నాయుడు పాత్రలో అతని నటన సూపర్. బ్రహ్మానందం పాత్ర నిడివి తక్కువే కానీ సినిమాపై మంచి ప్రభావం చూపిస్తుంది. చైతన్య రావు మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. రాగ్ మయూర్, జీవన్, రఘు, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. మిగతా పాత్రలంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం :

వివేక్ సాగర్ సంగీతం అలరిస్తుంది. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది. కెమెరా మెన్ పనితీరు సినిమాకు హెల్ప్ అయ్యింది. ఆర్ట్, ఎడిటింగ్ కూడా బాగా కుదిరాఇ. తరుణ్ భాస్కర్ రచన సినిమాను ప్రేక్షకులను టచ్ అయ్యేలా చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటం లైన్ : కీడా కోలా.. ట్రాక్ మార్చినా తరుణ్ నవ్వించేశాడు..!

Also Read : Boyapati Srinu : స్కంద OTT ఎఫెక్ట్.. బోయపాటిని ఆడేసుకుంటున్న నెటిజన్లు..!

  Last Updated: 04 Nov 2023, 08:21 AM IST