మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ

Mass Maharaja Ravi Teja టాలీవుడ్‌లో కామెడీ పండించే హీరోల్లో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. వెంకీ, దుబాయ్ శీను, కిక్.. ఇలా ఒకప్పటి మాట పక్కనపెడితే ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి సరైన కామెడీ ఎంటర్‌టైనర్ అయితే పడలేదు. వరుసగా యాక్షన్ సినిమాలతో సీరియస్ సబ్జెక్టులతోనే ఆడియన్స్‌ని పలకరించారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం లైట్ నోట్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఫ్యామిలీ సినిమాతో వచ్చేశారు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ చేసిన ఈ […]

Published By: HashtagU Telugu Desk
Bhartha Mahasayulaki Wignyapthi Movie Review

Bhartha Mahasayulaki Wignyapthi Movie Review

Mass Maharaja Ravi Teja టాలీవుడ్‌లో కామెడీ పండించే హీరోల్లో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. వెంకీ, దుబాయ్ శీను, కిక్.. ఇలా ఒకప్పటి మాట పక్కనపెడితే ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి సరైన కామెడీ ఎంటర్‌టైనర్ అయితే పడలేదు. వరుసగా యాక్షన్ సినిమాలతో సీరియస్ సబ్జెక్టులతోనే ఆడియన్స్‌ని పలకరించారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం లైట్ నోట్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఫ్యామిలీ సినిమాతో వచ్చేశారు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ చేసిన ఈ సినిమాలో ఎలా ఉందో చూసేద్దాం.

కథ పాతదే కానీ
ఇద్దరు భామల మధ్య నలిగిపోయే హీరో కథే ఇది అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కథేంటో ఆడియన్స్‌కి ఓ క్లారిటీ వచ్చేసింది. రామ్ సత్యనారాయణ (రవితేజ)కి ఇండియాలో ఒక వైన్ కంపెనీ ఉంటుంది. తెల్లదొరలు తయారు చేసిన మందునే మనం ఎందుకు తాగాలి.. మన తెలుగోడు తయారు చేసిన మందును తెల్లోళ్లు ఎందుకు తాగకూడదనే పాయింట్‌తో ఈ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఇందులో భాగంగా ‘అనార్కలి’ అనే కొత్త వైన్‌ని తయారు చేస్తాడు.

ఈ వైన్‌ని ప్రమోట్ చేసేందుకు స్పెయిన్‌లోని ఒక పెద్ద కంపెనీతో కొలేబరేషన్‌కి ట్రై చేస్తాడు. కానీ వాళ్లు దీన్ని రిజెక్ట్ చేస్తారు. దీంతో డైరెక్ట్‌గా ఆ కంపెనీ ఎమ్‌డీనే కలిసి దీని గురించి మాట్లాడదామని తన పీఏ లీల (వెన్నెల కిషోర్)తో కలిసి స్పెయన్ వెళ్తాడు. కానీ అక్కడ అనుకోని పరిస్థితుల్లో బిజినెస్ చేద్దామని వెళ్లిన ఆ కంపెనీ ఎమ్‌డీ మానస (ఆషికా రంగనాథ్‌)తో రామ్ కమిట్ అయిపోతాడు. అయితే తనకి ఇంతకుముందే పెళ్లయిందని కానీ తన భార్య బాలామణి (డింపుల్ హయాతీ) గురించి కానీ మానసతో చెప్పడు. మొత్తానికి తన పని ముగించుకొని హైదరాబాద్ వచ్చేస్తాడు.

అయితే కొంతకాలానికి ఆ మానస కాస్త హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుంది. అప్పుడు మొదలవుతుంది మన రామ్‌కి దబిడి దిబిడి. మరి తనకి పెళ్లయిందన్న విషయాన్ని రామ్.. మానసకి చెప్పాడా? అసలు మానసతో ఒక్కటైన సంగతి తన భార్యకి తెలిసిందా? చివరికి ఈ నారీ నారీ నడుమ మురారి కథ ఎలా ముగిసింది అనేదే మిగిలిన స్టోరీ.

ఫస్టాఫ్ ఫుల్ ఆన్ ఫన్
ముందు చెప్పుకున్నట్లుగా ఇదేం కొత్త స్టోరీ కాదు కానీ ఈ లైన్‌తో కథ రాసినప్పుడు చాలా నేచరుల్‌గానే కామెడీ జనరేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ కామెడీకి కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్, కంగారు తోడైతే థియేటర్లో జనాలు నవ్వడం కూడా చాలా నేచురల్. అందులోనూ సంక్రాంతి లాంటి పండగకి థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌‌కి ఇలాంటి సబ్జెక్ట్ తప్పకుండా నవ్వులు పూయిస్తుంది. ఈ పాయింట్‌ని డైరెక్టర్ కిషోర్ తిరుమల బాగా వర్కవుట్ చేశారు.

అందుకు తగ్గట్లే కామెడీ ట్రాక్‌లని కూడా బాగా రాసుకున్నారు. స్పెయిన్‌లో బెల్లం పాత్రలో సత్య చేసిన ఫన్, రవితేజ పీఏగా సినిమా మొత్తం వెన్నెల కిషోర్ చేసిన హంగామా, రవితేజ బావ సుదర్శన్‌గా సునీల్ పంచిన నవ్వులతో ఫస్టాఫ్ అంతా చాలా లైట్ వేలో నవ్వుతూ అలా అలా సాగిపోతుంది. ఇక మన హీరోగారి ప్రియురాలు హైదరాబాద్‌ ల్యాండ్ అవ్వడం, భార్య బాలామణికి పరిచయం అవ్వడంతో కథలో ఫ్రిక్షన్ మొదలవుతుంది. దాన్ని వాడుకుంటూ ఫస్టాఫ్‌లో రాసుకున్న షాపింగ్ మాల్ సీన్ మాత్రం థియోటర్లో బాగా పేలింది. అలానే చాన్నాళ్ల తర్వాత సునీల్ చేసిన కామెడీ కూడా ఆడియన్స్‌ని నవ్వించింది.

అయితే సెకండాఫ్‌లో కథ సీరియస్‌ టర్న్ తీసుకుంది.. ఇక ప్రియురాలి సంగతి ఇల్లాలికి.. ఇల్లాలి సంగతి ప్రియురాలికి హీరో చెప్తే పరిస్థితేంటి.. దాన్ని వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. అసలు డైరెక్టర్ ఈ కథకి ఎలా ముగింపు పలుకుతాడు అని ఆడియన్స్ ఎదురుచూడటం కామన్. కానీ ఇలాంటి సబ్జెక్టుపై మెసేజ్‌లు, జడ్జిమెంట్‌లు ఇవ్వడం కరెక్ట్ కాదని డైరెక్టర్‌కి కూడా బాగా తెలుసు. అందుకే తెలివిగా టైటిల్‌లో భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ సేఫ్‌గా ఉన్నారు. ఇక సినిమా క్లైమాక్స్‌లో కూడా సీరియస్ సబ్జెక్ట్‌పై హద్దు దాటి కామెడీ చేయకుండా లైట్‌వేలోనే ఎండ్ చేశారు. ఇది కొంతమందికి రొటీన్ క్లైమాక్స్ అనిపించొచ్చు కానీ ఇంతకంటే వేరే దారిలేదు అని ఆడియన్స్‌కి కూడా తెలుసు.

రవితేజ-సునీల్
చాన్నాళ్ల తర్వాత రవితేజని ఇలా కామెడీ మూడ్‌లో చూడటం ఆడియన్స్‌కి రిఫ్రెష్‌మెంట్‌లా అనిపిస్తుంది. ముఖ్యంగా రవితేజ నుంచి కామెడీ కోరుకునే వారికి ఈ సినిమా బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. అలానే రవితేజతో సునీల్‌కి ఉన్న ట్రాక్ కూడా బాగా క్లిక్ అయింది. ముఖ్యంగా ‘కిరసనాయిల్’ ట్రాక్ బాగా నచ్చుతుంది. ఇక మానస పాత్రలో ఆషికా సినిమా మొత్తం చాలా గ్లామర్‌గా అందంగా కనిపించింది. మరోవైపు రవితేజ భార్య బాలామణిగా డింపుల్ చాలా సింపుల్‌గా కనిపించింది.

ఇక సినిమాకి భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా డీసెంట్‌గా ఉంది. మాస్ పాట మాత్రం అదిరిపోయింది. బీజీఎమ్ కూడా సెట్ అయింది. మొత్తానికి భీమ్స్ ఈ పండక్కి మాంచి ఊపులో కనిపిస్తున్నాడు. ఇక కిషోర్ తిరుమల ఈ మధ్య కాలంలో నిరాశపరిచినా కూడా ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కారు. “భర్త తప్పు చేశాడని తెలిస్తే చెలరేగిపోయే భార్యలు.. అదే భర్తకి ఏమైనా జరిగితే వెంటనే చల్లారిపోతారు” అంటూ సాగే కొన్ని డైలాగ్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. మొత్తానికి అయితే అయితే ఈ పండక్కి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అయితే నిరాశపరచదు.. పండగకి నవ్వులు పూయిస్తుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి.. కొత్త బాటిల్‌లో పాత వైన్.. కానీ ఫన్

  Last Updated: 13 Jan 2026, 11:51 AM IST