నటీనటులు : బాలకృ ష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్, జాన్ విజయ్ తదితరులు
సంగీతం : ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ : సి.రామ్ ప్రసాద్
నిర్మా త: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
రచన – దర్శకత్వం : అనిల్ రావిపూడి
Bhagavanth Kesari Review & Rating అఖండ వీర సింహా రెడ్డి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా భగవంత్ కేసరి. అనీల్ రావిపుడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా కాజల్, శ్రీ లీల ఫీమేల్ లీడ్స్ గా నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో నేటి సమీక్షలో చూద్దాం.
కథ :
వరంగల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరి (Bhagavanth Kesari) (బాలకృష్ణ)కు అక్కడ జైలర్ శరత్ కుమార్ పరిచయం అవుతాడు. జైలర్ కూతురు విజయలక్ష్మి అలియాస్ విజ్జి పాప తో భగవంత్ కేసరికి అనుబంధం ఏర్పడుతుంది. విజ్జి పాపని ఆర్మీలో చేర్పించాలన్నది ఆమె తండ్రి కల. అయితే శరత్ కుమార్ అనుకోకుండా మరణించడంతో భగవంత్ కేసరి ఆ బాధ్యతల్ని తీసుకుంటాడు. ఆ ప్రయత్నం ఎలా సాగింది..? ఈ క్రమంలో సైకాలజిస్ట్ కాత్యాయని (కాజల్) వారికి ఎలా సహాయపడ్డది..? అసలు భగవంత్ కేసరి జైలుకి ఎందుకు వెళ్లాడు..? ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? బిలీనియర్ రాహుల్ సాంఘ్వి (అర్జున్ రాంపాల్) తో భగవంత్ కేసరికి ఉన్న వైరం ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కథనం – విశ్లేషణ :
బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబో సినిమా అనగానే బాలకృష్ణ (Bala Krishna) మార్క్ మాస్.. అనీల్ మార్క్ కామెడీ రెండు ఆడియన్స్ ఆశిస్తారు. కానీ ఇద్దరు వారికి బలాలైన యాక్షన్ కామెడీ కాకుండా ఎమోషనల్ సబ్జెక్ట్ తో వచ్చారు. భగవంత్ కేసరి డెఫినెట్ గా బాలకృష్ణ కెరీర్ లో డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. బాలయ్య అనగానే మాస్ రక్తం ఏరులై పారే విధ్వంసం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి.
బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ కూడా బాగా రాసుకున్నాడు అనీల్ రావిపుడి (Anil Ravipudi). అయితే దర్శకుడు తన బలమైన కామెడీని అసలు వినియోగించలేదు. సినిమాలో కామెడీకి స్కోప్ లేదా అంటే ఉంది కానీ ఎందుకో ఈ కథ ఇలానే చెప్పాలి అన్నట్టుగా అనీల్ భగవంత్ కేసరి తీశారు.
సినిమా లో బాలకృష్ణ శ్రీ లీల మధ్య సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. సినిమాను నిలబెట్టింది ఈ రెండు పాత్రలే. కాజల్ పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదు. అయితే బాలయ్య కాజల్ మధ్య సీన్స్ కూడా అలరిస్తాయి. సినిమా పాత్రల పరిచయానికి ఎక్కువ టైం తీసుకున్నాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ సినిమా ఇంప్రెస్ చేస్తుంది. సినిమాలో బాలకృష్ణ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అయ్యే సస్పెన్స్ కూడా అదిరిపోతుంది.
ఓవరాల్ గా భగవంత్ కేసరి మంచి ప్రయత్నమనే చెప్పొచ్చు. రొటీన్ మాస్ సినిమాలే కాదు కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా బాలయ్య నటిస్తాడని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ ఈ తరం యువకులకు బాగా అలరిస్తాయి. సినిమా అనీల్ బాలయ్య కాంబో భగవంత్ కేసరి కథ అంత కొత్తగా లేకపోయినా ట్రీట్ మెంట్ బాగుండటం వల్ల ఆడియన్స్ శాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది.
నటీనటులు :
బాలకృష్ణ భగవంత్ కేసరి పాత్రకు ప్రాణం పోశారు. దర్శకుడికి నటుడిగా ఎంత సరెండర్ అవుతాడు అన్నది ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. శ్రీ లీల ఈ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది. విజ్జి పాత్రలో ఆమె నటన ఇంప్రెస్ చేస్తుంది. కాజల్ ఉన్నంతవరకు బాగానే చేసింది. శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ పాత్రలు అలరించాయి. మిగతా వారంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగినట్టుగా కలరింగ్ ఉంది. థమన్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బిజిఎం అఖండ రేంజ్ కాకపోయినా మెప్పించాడు. కథ రొటీన్ గానే ఉన్నా కథనం దర్శకుడు బాగా రాసుకున్నాడు. కొత్త బాలకృష్ణని చూసేలా చేశాడు. ఆ విషయంలో అనీల్ కి మార్కులు పడ్డాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
బాటం లైన్ :
భగవంత్ కేసరి.. అడవి బిడ్డ అలరించాడు..!
Also Read : Mahesh Rajamouli : దసరాకి మహేష్ రాజమౌళి సినిమా ముహూర్తం..?