Site icon HashtagU Telugu

Phone Colour: మీ ఫోన్ రంగు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని తెలుసా..?

Phone Colours Imresizer

Phone Colours Imresizer

మీరు వాడే ఫోన్ మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని ఎంత మందికి తెలుసు..? స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు చాలా మంది తమకు నచ్చిన కలర్ గురించి ఆలోచిస్తుంటారు. స్మార్ట్ ఫోన్లను కేవలం డివైజుల్లా కాకుండా…వాటిలో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటారు. అంతే కాదు రంగు రంగుల ఫోన్లను ఇష్టపడే వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లు బ్లాక్, వైట్ లోనే కాకుండా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ చాలా రంగుల్లో వస్తున్నాయి.

ఒక వ్యక్తి తాను వాడే ఉపయోగించే ఫోన్ కలర్ బట్టి తన వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని కలర్ సైకాలజిస్ట్ మాథ్యూ ఒక బ్లాగ్ పోస్టులో వివరించారు. అయితే ఏ రంగు స్మార్ట్ ఫోన్ వాడితే ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుందో తెలుసుకుందాం. అసలు ప్రతి రంగు అర్థం ఏంటి..?

వైట్:
తెలుపు రంగు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు…శుభ్రత విషయాన్ని అస్సలు పట్టించుకోరట. విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారు. అన్ని విషయాలను బహిరంగంగానే మాట్లాడాలని చూస్తారట. అంతేకాదు ఉన్నత ప్రమాణాలను కూడా కలిగి ఉంటారు. తెలుపు అనేది స్వచ్చతకు గుర్తింపు. కాబట్టి తెలుపు రంగు వాడేవారు అన్ని విషయాల్లో తామే యజమానుల్లా ఫీల్ అవుతారట.

బ్లాక్:
బ్లాక్ అనే సెంటిమెంట్ చాలా మందిలో ఉన్నప్పటికీ…చాలా మంది బ్లాక్ కలర్ స్మార్ట్ ఫోన్ వినియోగించడానికి ఇష్టపడుతుంటారు. దాదాపు అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు కూడా బ్లాక్ కలర్ లోనే అందుబాటులో ఉంటాయి. అంతేకాదు బ్లాక్ కలర్ చూడటానికి చాలా స్టైలీష్ లుక్ లో ఉంటుంది. బ్లాక్ కలర్ తో ఫింగర్ ప్రింట్స్ , స్మడ్జ్ ల గురించి పెద్దగా పట్టించుకోవల్సిన అవసరంలేదు. ఎందుకంటే బ్లాక్ అన్నింటిని చక్కగా దాచుతుంది. ఇక బ్లాక్ కలర్ ను ఇష్టపడేవారు మోడ్రన్ గా, వృత్తి నైపుణ్యం, పవర్ ఫుల్, గాంభీర్యం వంటి లక్షణాలను కలిగి ఉంటారని మాథ్యూ చెప్పారు.

బ్లూ:
స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా బ్లాక్ తర్వాత బ్లూ కలర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. బ్లూ కలర్ ఐఫోన్ చూడటానికి చక్కగా, ట్రెండీగా ఉంటుంది. బ్లూ కలర్ ఫోన్లను ఇష్టపడే వ్యక్తులు రిజర్వడ్ గా, ప్రశాంతంగా ఉంటారట. లోతుగా ఆలోచించడం, జాగ్రత్తలు పాటించడం, నటించే ముందు ఆలోచించడం, సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, సంప్రదాయంతో ముడిపడి ఉంటారట.

రెడ్ :
రెడ్ ప్రతిఒక్కరూ ఇష్టపడితే కాదు. కానప్పటికీ ఐఫోన్ తన వేరియంట్ లను చాలా వరకు రెడ్ కలర్ లోనే రిలీజ్ చేస్తుంది. అంతేకాదు రెడ్ కలర్ ఐఫోన్ చాలా మంది ఇష్టపడుతున్నట్లు గుర్తించింది. రెడ్ కలర్ ఇష్టపడేవారు భౌతిక శక్తి, పోటీతత్వం, దూకుడుగా ప్రవర్తిస్తారు. ఈ కలర్ ను ఇతరులు దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే వ్యక్తులు ఇష్టపడతారు.

గోల్డ్ :
గోల్డ్ అనేది సంపదకు సూచిక. మాథ్యూ ప్రకారం…ఉదారత, భౌతికవాదంతో అనుబంధాలను కలిగి ఉంటుంది. గోల్డ్ కలర్ ఫోన్ వాడే వ్యక్తులు సామాజిక స్థితి గురించి తెలుసుకుంటారు. ఆర్థికంగా ఎంత సక్సెస్ అయ్యారో తెలుసుకోవలని, విలాసవంతమైన వస్తువుల పట్ల ప్రత్యేక ఇష్టాన్నిచూపిస్తుంటారు.

Exit mobile version