Site icon HashtagU Telugu

Hair Tips : విలేజ్ అమ్మాయిల పొడవాటి జుట్టు సీక్రెట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..

You Will Be Shocked To Know The Secret Of Long Hair Of Village Girls

You Will Be Shocked To Know The Secret Of Long Hair Of Village Girls

Ling Hair Tips : మామూలుగా అమ్మాయిలు అందమైన ముఖం శరీరంతో పాటుగా జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల చాలామంది అమ్మాయిలు జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో హెయిర్ గ్రోత్ కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అయితే ఒక విషయం బాగా గమనించి ఉంటే విలేజ్ అమ్మాయిల జుట్టు పొడవుగా అందంగా నల్లగా మెరుస్తూ ఉంటుంది. కానీ సిటీలలో ఉండే అమ్మాయిల జుట్టు (Hair) కాస్త ఎరుపుగా పొట్టిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు కూడా విలేజి అమ్మాయిల లాగ అందమైన జుట్టు (Hair) కావాలని కోరుకుంటున్నారా. అయితే ఈ చిట్కాను ఫాలో అవ్వాల్సిందే..

We’re now on WhatsApp. Click to Join.

ఇందుకోసం మందార పువ్వుల్ని తీసుకోవాలి మందార పువ్వులు వద్దు అనుకున్న వాళ్ళు మందార పౌడర్ కూడా తెచ్చి వాడుకోవచ్చు. తర్వాత నిత్యం ఇంట్లో వండుకునే బియ్యం ఒక గ్లాస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల నీళ్లను పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. దాని తర్వాత పది మందార పువ్వులను తొడిమెలు తీసి నానబెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి.

తర్వాత వాటిని చేతితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. లేదా మిక్సీలో కూడా పేస్టులా చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత కలమంద తీసుకొని దానిని శుభ్రం చేసి లోపల ఉన్న గుజ్జుని తీసుకొని ఈ మందార మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక పల్చటి గుడ్డలో వేసి వడకట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒక స్పూన్ కస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి.

ఈ ఆయిల్ వద్దు అనుకున్న వాళ్లు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. ఈ నూనె వేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ మిశ్రమాన్ని అలాగే కూడా బాగా పట్టించవచ్చు. దీనిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం 20 రోజులు ఉంటుంది.

ఈ మిశ్రమం జెల్ గా ఉంటుంది. దీన్ని జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలి. దీనిని అప్లై చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు పాటు బాగా మర్దన చేయాలి. ఈ విధంగా మర్దన చేయడం వలన బెడ్ సర్కులేషన్ బాగా జరిగి జుట్టు రాలడం ఆగిపోతుంది. దీనిని పెట్టుకున్న తర్వాత ఒక అర్థగంట పాటు ఉండాలి. తర్వాత ఏదైనా గాఢత తక్కువ గల షాంపుతో లేదా కుంకుడుకాయలతో శుభ్రంగా స్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు అప్లై చేయడం వలన జుట్టు రాలడం తగ్గిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే బట్టతల వచ్చిన వాళ్లకి కూడా తిరిగి జుట్టు మొలుస్తుంది.

Also Read:  Diesel Engine: డీజిల్ తో బైకులు ఎందుకు రావు.. బైక్ లో డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా?