5 Mood Elevating Foods: మూడ్ ఆఫ్ అయ్యిందా.. అయితే ఈ ఆహార పదార్థాలు తినండి!

ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మనం తీసుకునే ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మానసిక స్థితి పై ప్రభావం చూపుతుంది.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 08:15 AM IST

ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మనం తీసుకునే ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మానసిక స్థితి పై ప్రభావం చూపుతుంది. సరైన పోషకాలతో కూడిన అధిక నాణ్యత కలిగిన ఆహారం మెదడుకు ఇంధనం వంటిది. ఇది మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మరి మానసిక స్థితిని పెంచే ఐదు ఆహారాలు కూడా ఉన్నాయి. మన వంటింట్లో దొరికే ఈ ఐదు ఆహారాలతో మానసిక స్థితిని పెంచుకోవచ్చట. అయితే మరి మానసిక స్థితిని పెంచే ఆ ఐదు ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అరటిపండ్ల లో చక్కెర, ఫైబర్, విటమిన్ B6 లభిస్తాయి. ఇవి మానసిక స్థితిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. మానసిక స్థితిని తక్షణమే ఉత్తేజపరుస్తాయి. ఓట్స్..జును ప్రారంభించడానికి ఓట్స్ ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. ఓట్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడంలో బాగా పనిచేస్తది. ఓట్స్ అలసటను తొలగించి బూస్టర్‌లుగా కూడా పనిచేస్తాయి. అంతేకాకుండా రోజంతా ఎనర్జిటిక్ గా ఆరోగ్యంగా ఉండడానికి ఇవి బాగా సహాయపడతాయి. అలాగే డార్క్ చాక్లెట్లు తినడానికి రుచి అద్భుతంగా ఉండటంతో పాటుగా సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి. ఈ డార్క్ చాక్లెట్లు మానసిక స్థితిని పెంచడమే కాకుండా రోజంతా మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి.

నట్స్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందె. నట్స్ లో ఉండే కొన్ని గింజలు,విత్తనాలు కోపాన్ని, డిప్రెషన్ ను తగ్గించి మానసిక స్థితిని పెంచుతాయి. బీన్స్ లేదా కాయధాన్యాలు పప్పులు సూపర్ ఫుడ్స్‌గా పరిగణించబడతాయి. అవి జింక్ మరియు మెగ్నీషియం యొక్క అద్భుతమైన మూలం, ఇవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. అంతేకాకుండా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి.