చార్ కోల్ లేదా బొగ్గు ఉపయోగించే మీ అందాన్ని పెంచుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా. బొగ్గుతో అందాన్ని పెంచుకోవడం ఏంటా అని అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. బొగ్గుతో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొగ్గు చర్మాన్ని కాలుష్యం నుంచి కాపాడుతుందట. అలాగే చర్మం లోని టాక్సీన్ ను గ్రహిస్తుందట. ముఖాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుందట. అందుకే రాత్రిపూట బొగ్గు ఆధారిత ఫేస్ వాష్ తో ముఖాన్ని కడుక్కొని పడుకోవటం వలన చర్మం మరింత యవ్వనంగా తాజాగా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే ఒక టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ బొగ్గు,కొంచెం కొబ్బరి నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవడం వలన చర్మం మీద ఉన్న రంధ్రాలు తెరుచుకునే లాగా చేసి చర్మ గ్రందులలో ఉన్న మురికి తొలగిపోయేలాగా చేస్తుందట. చార్కోల్ ని ముఖానికి మాస్క్ గా పెట్టుకోవడం వలన ముఖంపై ఉండే జుట్టు తొలగిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుందట. బొగ్గులో కొంచెం నీటిని కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము దూళి కణాలను శుభ్ర పరిచి మొటిమలను రాకుండా చేయవచ్చట.
అలాగే కొన్నిసార్లు ముఖం రంధ్రాలు బాగా తెరుచుకుంటాని చెబుతున్నారు. దీనివలన మొఖం చూడటానికి ఇబ్బంది కరంగా కనబడుతుందట. అటువంటి సమయంలో ఉత్తేజిత బొగ్గు మీ ముఖం రంధ్రాలను తిరిగి నిరోధించడంలో మీకు సహాయపడుతుందట. లోపల నుంచి వాటిని శుభ్రం చేయడం ద్వారా ఓపెన్ రంధ్రాలను తగ్గిస్తుందని చెబుతున్నారు.