Vasthu Tips: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా..వాస్తులోపమేమో తెలుసుకోండి?

చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బులు చేతిలో నిలవడం లేదు అని ఆర్థిక సమస్యలతో బాధపడుతూ

Published By: HashtagU Telugu Desk
Vasthu Tips

Vasthu Tips

చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బులు చేతిలో నిలవడం లేదు అని ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయని అలాగే ఇంట్లో డబ్బు కొరత వస్తుంది అనే బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలకు అధికంగా ఖర్చుపెట్టి వేస్ట్ ఖర్చులు చేయడం ఒక కారణం అయితే వాస్తు ప్రకారం గా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మరి ఎటువంటి వాస్తు లోపాలను సవరిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంటి ఉత్తర దిశలో ఏమైనా లోపం ఉన్నట్లయితే రుణ భారం పెరుగుతుంది. ఎప్పుడు ఉత్తర దిక్కున దేవుడి దిశగా కూడా పరిగణిస్తూ ఉంటారు.

ఉత్తర దిశను ఎప్పుడు ఓపెన్ గా ఉంచడంతోపాటు ఫర్నిచర్ లాంటి బరువు ఉన్న వస్తువులను ఉత్తరదిశలో ఉంచకూడదు. ఒకవేళ మీ ఇంట్లో ఉత్తర మూలలో ఎక్కువ ఎత్తు ఉన్నట్లు అయితే దానిని వాస్తులోపంగా పరిగణించాలి. ఇల్లు నిర్మించేటప్పుడు మీరు ఉత్తర దిశను కవర్ చేసి దక్షిణ దిశను ఖాళీగా ఉంచినట్లు అయితే ఒక రకమైన లోపంగా పరిగణించబడుతుంది. అలాగే నైరుతి దిశలో ఉన్న భూగర్భ నీటి ట్యాంకు కారణంగా మీరు ఎక్కువగా రుణాలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో మీరు వ్యాపార భాగ్య స్వాములతో విభేదాలను ఎదుర్కొంటూ ఉంటే మీరు మీ ఇంటి ఈశాన్య దిశ ను తనిఖీ చేయాలి. ఆ దిశలో ఒక యంత్రాన్ని స్థాపించినట్టయితే అది చాలా వేడిని విడుదల చేస్తుంది. అది కూడా ఒక పెద్ద వాస్తు లోపంగా భావించాలి.

ఈ కారణంగా చేసే పనిలో సమస్యలు మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు చట్టపరమైన వివాదాలను ఎదుర్కొంటున్న అది మీ నీటి ట్యాంకు తప్పు దిశ వల్ల అలా జరుగుతుంది అని మీరు పరిగణించాలి. ఆగ్నేయ దిశలో వాక్య ట్యాంక్ ను చిన్నట్లయితే అది వాస్తు లోపాన్ని నివారిస్తుంది. ఆగ్నేయ దిశకు యజమాని అగ్నిదేవుడు. కాబట్టి ఈ దిశలో వాటర్ ట్యాంక్ ను ఉంచితే అంతా మంచే జరుగుతుంది.

  Last Updated: 08 Nov 2022, 08:52 PM IST