Site icon HashtagU Telugu

Yoga for Your Healthy Heart : మీ గుండె క్షేమంగా ఉండాలంటే…

Yoga Heart

Yoga Heart

గుండె (Heart) ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని యోగ (Yoga) ఆసనాలు ఉన్నాయి. వాటిని అందరు తప్పకుండా చేయాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు ముందు నుంచే ఇటువంటి యోగ (Yoga) ఆసనాలు చేసినట్టయితే, మీ గుండె ఆరోగ్యంగానూ, బలంగానూ ఉంచుకోవచ్చు.

తదాసనం:

నిటారుగా నించుకోవాలి. రెండు చేతులను పైకి ఎత్తాలి. అలా పైకి ఎత్తిన చేతుల వేళ్లను కలపాలి. అరచేతులు సూర్యుడివైపు చూసేలా పెట్టి 10 సెకండ్లపాటు ఉంచాలి. తర్వాత మామూలు స్థితికి వచ్చేయాలి. ఇలా 3-5 సార్లు చేస్తే చాలు.

అదో ముఖ స్వనాశనం:

ముందుకు వంగి రెండు చేతులను నేలకు అనించాలి. వీ ఆకారం పల్టీ కొడితే ఉండే మాదిరి.. మన శరీర భంగిమ ఉండాలి. నడుము భాగం మధ్యలో ఎత్తుగా ఉండాలి. పక్కన ఇమేజ్ చూసి తెలుసుకోవచ్చు. కొన్ని సెకన్ల పాటు ఇలా ఉంచితే చాలు. రోజులో 10 సార్లు ఇలా చేయాలి.

భుజంగాసనం:

చదరపు నేలపై యోగా మ్యాట్ వేసుకోవాలి. దానిపై బోర్లా పడుకోవాలి. అనంతరం రెండు చేతుల సపోర్ట్ తో నడుము నుంచి తల వరకు పై భాగాన్ని నిదానంగా పెకి ఎత్తి ఉంచాలి. 30 సెకండ్ల తర్వాత సాధారణ స్థితికి రావాలి. రోజులో ఇది 3-4 సార్లు చేయవచ్చు.

సేతు బంధాసనం:

ఈ ఆసనంలో వెల్లకిలా పడుకోవాలి. అప్పుడు నడుము భాగాన్ని పైకి ఎత్తాలి. మోకాలు నుంచి కింది వరకు కాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. రెండు చేతులను చాచి రెండు కాళ్లను పట్టుకునే విధంగా ఉంచితే సరిపోతుంది. ఇలా ఒక్కోసారి 10 సెకండ్ల పాటు 4-5 సార్లు చేయవచ్చు.

పశ్చిమోత్తాసనం:

కింద కూర్చుని, రెండు కాళ్లను నిటారుగా చాచాలి. రెండు పాదాలు తలవైపు వంగి ఉండాలి. తలను క్రమ క్రమంగా పాదాల వైపునకు తీసుకెళ్లాలి. రెండు చేతులతో రెండు కాళ్లను పట్టుకుంటే సపోర్ట్ గా ఉంటుంది. దీన్ని 10-20 సెంకడ్ల పాటు చేయాలి. ఇలా రోజులో రెండు సార్లు చేస్తే చాలు.

శవాసనం:

చదరపు నేలపై వెల్లకిలా పడుకోవాలి. రెండు చేతులు, రెండు కాళ్లను చాలా సాఫీగా, సౌకర్యంగా పెట్టుకోవాలి. కదలకుండా 20 సెకండ్లపాటు చేయాలి.

Also Read:  Relationship Tips : ఈ 5 విషయాలను తెలుసుకున్న తరువాతే రిలేషన్ షిప్ లోకి వెళ్ళండి..

Exit mobile version