యోగా (Yoga ) అనేది కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక మరియు లైంగిక ఆరోగ్యానికి కూడా గొప్ప ఉపయోగం కలిగించే సాధన. కొన్ని ఆసనాలు శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్మోన్ల సమతుల్యతను స్థిరంగా ఉంచుతాయి. దీని ఫలితంగా శరీరం లైంగికంగా యాక్టివ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. ఉదాహరణకు భుజంగాసనం (కోబ్రా పోజ్) శృంగార అవయవాలకు రక్తప్రసరణను పెంచి, నరాలను ఉత్తేజింపజేస్తుంది. అలాగే సేతుబంధాసనం (బ్రిడ్జ్ పోజ్) నడుము భాగానికి బలం ఇవ్వడం ద్వారా లైంగిక స్టామినాను పెంచుతుంది.
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
బద్ధ కోణాసనం (బటర్‌ఫ్లై పోజ్) తొడల భాగాలను బలపరిచే ఈ ఆసనం ద్వారా యోని ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాక ధనురాసనం శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చి శృంగార జీవితాన్ని ఉత్తేజితం చేస్తుంది. పశ్చిమోత్తానాసనం అయితే ఒత్తిడిని తక్కువ చేసి, వెన్నెముక మరియు తొడలకు బలం చేకూర్చి లైంగిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఈ ఆసనాలన్నీ శరీరాన్ని సరైన రీతిలో ఆకృతీకరించడంతో పాటు, మానసికంగా సైతం లైంగికంగా మరింత చురుకుగా ఉండేందుకు సహాయపడతాయి.
Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్
లైంగిక అనుభూతిని మరింత మెరుగుపరచాలంటే ఉత్కట కోణాసనం, విపరీత కరణి వంటి ఆసనాలను కూడా ప్రయత్నించవచ్చు. ఇవి శరీరంలోని అలసటను తొలగించి హార్మోన్లను ఉత్తేజింపజేస్తాయి. ప్రాణాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం ద్వారా శ్వాస సంబంధిత కండరాలకు బలం చేకూరుతుంది, తద్వారా శృంగార సామర్థ్యం మెరుగవుతుంది. శరీరానికి సరిపడిన నిద్ర, సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా లైంగిక ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది. యోగా ద్వారా శరీరం, మానసిక స్థితి బలపడటంతో లైంగిక జీవితం మెరుగుపడుతుంది.
