యోగ (Yoga ) అనేది భారతదేశంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన శారీరక, మానసిక సాధన విధానం. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా మన శరీరాన్ని, మనస్సును, ఆత్మను సమతుల్యంలో ఉంచే శాస్త్రం. యోగ సాధన ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు, శరీరాన్ని ఉత్తమంగా నిర్వహించుకునే శక్తి కలుగుతుంది. ప్రత్యేకించి ఉదయాన్నే యోగాసనాలు చేయడం వల్ల రోజు మొత్తం శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ విభాగాలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈ సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. భావోద్వేగ నియంత్రణ సాధించడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు యోగా ఒక ఉత్తమ మార్గం.
lifestyle : నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మనిషి శరీరంలో ఎన్ని అద్బుతాలు జరుగుతాయంటే?
ప్రముఖ వైద్య నిపుణుల ప్రకారం.. యోగా అనేది డయాబెటిస్, గ్యాస్ట్రిక్, శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక నొప్పులు వంటి అనేక జీవనశైలి వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారికి సరైన యోగాసనాలు ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజూ కొద్దిసేపు యోగాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు.